Viral News in Telugu: "భార్య నన్ను చిత్రహింసలు పెడుతోంది. జైలుకి వెళ్లమన్నా వెళ్తా కానీ ఇంటికి మాత్రం వెళ్లను" అంటున్నాడో భర్త. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న యువకుడు ఉన్నట్టుండి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎక్కడికి వెళ్లిపోయాడో అని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. తెలిసిన చోటల్లా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అన్ని చోట్లా గాలించగా చివరకు నోయిడాలో కనిపించాడా యువకుడు. ఓ మాల్‌లో సినిమా చూసి బయటకు వస్తుండగా గుర్తించారు. నచ్చజెప్పి మళ్లీ బెంగళూరుకి తీసుకొచ్చారు. ఆగస్టు 4వ తేదీన అదృశ్యమైన యువకుడు ఇన్నాళ్లకు దొరికాడు. అయితే...అతని భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్ అయింది. పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించింది. ఫలితంగా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అప్రతమత్తమైన యువకుడిని పట్టుకున్నారు. ATM కి వెళ్లి డబ్బులు తీసుకొస్తానని బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అయితే..కనిపించకుండా పోయినప్పటి నుంచి అతని ఫోన్ స్విఛాఫ్‌లోనే ఉంది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు అన్న వివరాలేమీ తెలియదు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడికి వెళ్లాడో విచారించారు. అయితే..నోయిడాలో ఆ యువకుడు ఓ సిమ్‌ కొన్నట్టు గుర్తించారు. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేశారు. 


మాల్ నుంచి బయటకు వస్తుండగా ముగ్గురు పోలీసులు గుర్తించి అతనిని చుట్టుముట్టారు. ఇంటికి వెళ్దామని నచ్చజెప్పారు. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు. చాలా సేపు బతిమాలాక అప్పుడు ఒప్పుకున్నాడు. "నన్ను జైల్లో అయినా పెట్టండి. కానీ ఇంటికి మాత్రం వెళ్లను" అని తేల్చి చెప్పాడు. కానీ ఎలాగోలా నచ్చజెప్పి పోలీసులు ఇంటికి తీసుకెళ్లారు. తన భార్య మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చిందని తెలుసుకుని అప్పుడు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అయితే..భార్య తనను పదేపదే వేధిస్తోందని పోలీసులకు వివరించాడు. 


"నేను ఆమెకి రెండో భర్తని. మూడేళ్ల క్రితం తనతో పరిచయమైంది. అప్పటికే ఆమెకి విడాకులయ్యాయి. 12 ఏళ్ల కూతురు ఉంది. ఆమెని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాను. మాకు 8 నెలల కూతురుంది. నాకు స్వేచ్ఛనివ్వడం లేదు. ప్రతి చిన్న దానికీ అరుస్తోంది. ఆమె చెప్పినట్టే డ్రెస్ వేసుకోవాలి. కనీసం టీ తాగడానికి కూడా బయటకు వెళ్లలేకపోతున్నాను. అందుకే నన్ను జైలుకైనా పంపించండి. అక్కడ ప్రశాంతంగా ఉంటాను. ఇంటికి మాత్రం వెళ్లను"


- యువకుడు


అతని భార్య సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు షేర్ చేసింది. భర్త కనిపించడం లేదని, సాయం చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లు వైరల్ అవడం వల్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే..ఆ యువకుడు తనను గుర్తు పట్టకుండా గెటప్ మార్చాడు. హెయిర్ కట్ చేయించుకున్నాడు. బెంగళూరు నుంచి తిరుపతి వరకూ బస్‌లో వెళ్లాడు. అక్కడి నుంచి భువనేశ్వర్‌ వెళ్లి అక్కడి నుంచి నోయిడాకి వెళ్లినట్టు పోలీసులు వివరించారు. 


Also Read: Viral Video: పార్లమెంట్‌లో రచ్చరచ్చ, రక్తం వచ్చేలా పొట్టుపొట్టు కొట్టుకున్న ఎంపీలు - వీడియో