Bengaluru Comedy with Memes: ఇండియా సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో వర్షం పడితే నరక యాతన కనిపిస్తుంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో బెంగళూరు అతలాకుతలం అయిపోయింది. నీళ్లు రోడ్లపై నిలిచాయి. దీంతో వాహనదారులు రెండు రోజుల పాటు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వాన కష్టాలపై నెటిజన్లు తమ సమస్యను కామెడీగా మీమ్స్ రూపంలో ఎత్తి చూపిస్తున్నారు. ఈ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
బెంగళూరు గ్లోబల్ సిటీగా మారినా డ్రైనేజీ సిస్టమ్ అత్యంత ఘోరంగా ఉంది. కాలువలు చిన్నవి కావడంతో పెద్ద వర్షం వస్తే తట్టుకోవడం కష్టం అవుతుంది. దీంతో వర్షం పడితే చాలు నగర వాసులు బయటకు రాకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఆఫీసులకు వెళ్లాల్సిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
క్లౌడ్ టెక్నాలజీ మీద పని చేసవాళ్లు .. బెంగళూరులో అయితే నిజంగానే క్లౌడ్స్ లో ఉండి పనిచేయవచ్చని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
ఇటీవల పాకిస్తాన్ తాము బెంగళూరు పోర్టును ధ్వంసం చేశామని చెప్పుకుంది. దీన్ని గుర్తు చేసుకుని కొంత మంది తాజా వరదల పరిస్థితిని లింక్ పెట్టి జోకులేస్తున్నారు.
బెంగళూరులో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పెంచకపోతే... మల్టినేషనల్ కంపెనీలు, ఉద్యోగులు వేరే దారి చూసుకుంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.