Bengaluru man slams Swiggy Instamart for adding free tomatoes : స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వాడే వారు సిటీల్లో చాలా మంది ఉంటారు. బెంగళూరులోనూ ఉన్నారు. ఇలా స్విగ్గి ఇన్ స్టా మార్ట్ కస్టమర్ ఒకరు ఫ్రెష్ ఎగ్స్ కొందామని కార్ట్‌లో పెట్టాడు. అయితే దానికి అర కేజీ టొమాటాలు కూడా యాడ్ అయ్యాయి. ఆ పెద్దాయన వాటిని యాడ్ చేయలేదు. దాంతో రిమూవ్ చేయాలని ప్రయత్నించాడు. అవ్వలేదు. కాస్ట్ చూస్తే ఫ్రీ అని ఉంది. ఉచిత టొమాటాలు అయితే ప్రమోషనల్ ఆఫర్ అనుకుని ఎవరైనా  తీసేసుకుంటారు. పైగా టొమాటోలు ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ముందూ వెనుకా ఆలోచించరు. కానీ ఆయనకు మాత్రం కోపం వచ్చింది. ఫ్రీగా ఇస్తారా పైగా.. వద్దు అనడానికి ఆప్షన్ లేకండా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆ పెద్దాయన పేరు రామానుజన్. ప్రత్యేకంగా ఏమీ చెల్లించాల్సి లేకపోయిన ఇలా చేయడంపై స్విగ్గి ఇన్‌స్టా మార్ట్ పై ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని డార్క్ ప్యాట్రన్ గా అభివర్ణించారు. అంటే ఉచితంగా టామోటాలు ఇచ్చి మన దగ్గర నుంచి సీక్రెట్ గా ఏదో తీసేసుకుంటున్నారని ఆయన అనుకుంటున్నారు. ఏదీ ఉచితంగా ఇవ్వరని లఆయన బలంగా నమ్ముతున్నారేమో కానీ.. కనీసం వ్యక్తిగత విషయాలు అయినా సేకరిస్తూ ఉంటారని అనుకున్నారు. కనీసం తమకు అవసరం లేని టమోటాలను తొలగించే ఆప్షన్ కూడా లేకపోవడం డార్క్ ప్యాట్రన్ అని అంటున్నారు. 



తన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉచితంగా ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. పైగా మార్కెట్‌లో టొమాటో రేట్లు మండిపోతున్నాయి. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు  .  



అయితే ఉచితంగా ఇవ్వడం గురించి తాను చెప్పడం లేదని.. ఉచితంగా ఇచ్చినా తీసుకోవాలా వద్దా అన్న చాయిస్ కస్టమర్ కు ఇవ్వాలన్నది తన ఉద్దేశమని ఆయన చెబుతున్నారు. ఆయన చెబుతున్న విషయంలోనూ లాజిక్ ఉన్నట్లే.