Bengaluru hoteliers wary of freeloaders feigning as food influencers : ఓ సినిమాలో వేణుమాధవ్ ఫుల్లుగా తినేసి స్టైల్‌కా రాసుకోమంటాడు. నువ్ ఎవరివో తెలియదు కదా అంటే.. మీ ఊరివాడినో అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఇప్పుడు బెంగళూరు హోటల్స్ లో ఇలాంటి వాళ్లు ఎక్కువైపోయారు. ఫుల్లుగా తినేసి.. మీ ఊరివాడినే అని కాకుండా.. ఫుడ్ వ్లాగర్‌నని..బిల్లు కట్టకుండా జంపయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హోటల్ యాజమానులకు చిర్రెత్తిపోతోంది.
హోటళ్లకు వెల్లువలా ఫుడ్ వ్లాగర్స్
ఇప్పుడు అంతా యూట్యూబ్ మయం. ఎక్కువ మంది యువకులు.. రకరకాల వ్లాగర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఫుడ్ వ్లాగర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో కొన్నివేల మంది వ్లాగర్స్ అది అదే పని. కెమెరా పట్టుకుని రోడ్డు మీదకు వెళ్లడం ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్ లో తిని.. డబ్బులు చెల్లించకుండా వెళ్లడం కామన్ అయిపోయింది. ముందుగా యజమానులతో మాట్లాడుకుని వీడియోలు తీసేవాళ్లు కొంత మంది ఉంటే... అసలు పర్మిషన్ తీసుకోకుండా వీడియోలు తీసుకుని.. తిన్న తర్వాత తాము మంచి రేటింగ్ ఇస్తామని.. మంచిగా చెబుతామని బ్లాక్ మెయిల్ తరహాలో మాట్లాడేవారు కొందరు.
కస్టమర్ జాక్ పాట్ కొడితే రూ. వెయ్యి చేతిలో పెట్టారు - క్రెడ్ కంపెనీ తీరుపై నెటిజన్ల విమర్శలు
ఫ్యామిలీతో సహా వచ్చి తినేసి బిల్లు ఎగ్గొడుతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్
ఇలాంటి వ్లాగర్స్ క్రమంగా పెరిగిపోతూండటంతో ప్రముఖ హోటల్స్ యాజమాన్యాలు కూడా చిరాకు పడుతున్నాయి. హోటల్స్ కు ఎవరు పడితే వారు కెమెరాలు పట్టుకు వచ్చి ..వీడియోలు చేయడం.. ఇష్టం వచ్చినట్లుగా తిని బిల్లులు ఇవ్వకుండా వెళ్లడం వంటి పద్దతులను మార్చాలని అనుకుంటున్నారు. అందుకే హోటల్ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ విధానం తీసుకు రావాలని అనుకుంటున్నారు.
జోథ్‌పూర్ ప్యాలెస్‌లో హీరోయిన్ జుబేదా ఆత్మ - సినిమాకు తీసిపోని ఈ మహరాజా లవ్ స్టోరీ ధ్రిల్లరే !
ఏదో ఒకటి చేయాలనుకుంటున్న హోటల్ యజమానులు
హోటల్స్ కు ఆన్ లైన్ లో వచ్చే ప్రచారం కూడా కీలకమే. చాలా మంది ఫుడ్ వ్లాగర్స్ వీడియోలు చేసి.. చాలా మంచి ఫుడ్ అని ఆన్ లైన్ లో రివ్యూలు ఇస్తూంటే.. ఇతరులు ఇన్ స్పయిర్ అయి వెళ్తూంటారు. ఎందుకంటే.. మంచి ఫుడ్ ను టేస్ట్ చేయాలనుకునేవారు ఎంత దూరం అయినా ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ కారణంగా వీడియోల్లో బాగా చెబితే తమ బిజినెస్ పెరుగుతుదంని కొంత మంది హోటల్ యజమానులు ప్రోత్సహిస్తున్నారు. కానీ రాను రాను దీన్ని ఫుడ్ వ్లాగర్స్ అవకాశంగా తీసుకుని ఫ్రీ ఫుడ్ కోసం అన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో సమస్య వస్తోంది.
బెంగళూరులోనే కాకుండా.. హైదరాబాద్‌తో పాటు ఇతర చోట్ల కూడా ఇలాంటి వ్లాగర్స్ పెరిగిపోతున్నారు. హోటల్స్ అన్నీ కలిపి ఇలాంటి వారిని కట్టడి చేయాల్సి ఉంటుందేమో ?