Belarus to Join Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆ సరిహద్దు దేశాలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఈ యుద్ధంలో తల దూర్చేందుకు బెలారస్ తాజా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బెలారస్ విదేశాంగ మంత్రి చెప్పడం విశేషం.
మేం రెడీ!
బెలారస్ విదేశాంగశాఖ మంత్రి వ్లాదిమిర్ మేకీ ఓ రష్యా పత్రికతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు కచ్చితంగా స్పందిస్తామన్నారు. సరిహద్దు దేశాల నుంచి వచ్చే కవ్వింపులకు స్పందించేలా తమ సైన్యం, ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ వారం బెలారస్‌లో సైనిక కదలికలు తీవ్రమైన సమయంలో వ్లాదిమిర్ మేకీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో.. రష్యాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. రష్యా బలగాలతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద తమ బలగాలను మోహరించాలని ఆయన ఆదేశించారు.
రష్యా
తాజాగా రష్యా మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. అయితే తాజాగా మూడో ప్రపంచ యుద్ధం (Russia Warns World War III Against Ukraine) రావొచ్చని రష్యా వార్నింగ్ ఇచ్చింది.
చేర్చుకుంటే
ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెన్డిక్టోవ్ హెచ్చరించారు.
" ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవడం వంటి చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయి. ఈ విషయం ఉక్రెయిన్‌కు బాగా తెలుసు. ఉక్రెయిన్‌కు సాయం చేసే పశ్చిమ దేశాలను యుద్ధంలో భాగస్వాములుగా పరిగణస్తాం. "
రష్యాకు సంబంధించిన ఆస్తులపై దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Burnt Hair Perfume: సేల్స్‌మెన్‌లా మారిపోయిన మస్క్- ప్లీజ్ కొనండి అంటూ ట్వీట్!