Bangledesh Plane Crashes Into School Campus: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌లో 2025 జులై 21న మధ్యాహ్నం బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఒక శిక్షణా విమానం కూలిపోయింది.  F-7 BGI, చైనా తయారీ శిక్షణా జెట్ కూలిపోయిందని అధికారికంగా ధృవీకరించారు.  విమానం  అయిన  టేకాఫ్ తర్వాత కొద్దిసేపటికే  మైల్‌స్టోన్ కాలేజీ క్యాంపస్‌లోని ఒక భవనంలోి  క్యాంటీన్ రూఫ్‌పై కూలిపోయింది.   ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు నిర్ధారించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  భావిస్తున్నారు.  కనీసం 13 మంది గాయపడ్డారు.  వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. కొందరు తీవ్ర గాయాలతో ఢాకాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి,  ఉత్తర ఆధునిక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.  పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ తౌకీర్ ఇస్లాం సాగర్  మరణించినట్లుగా భావిస్తున్నారు.  

 విమానం కూలిన వెంటనే భవనంలో పేలుడు సంభవించి, భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది.  వీడియోలు, టెలివిజన్ ఫుటేజీలలో దట్టమైన పొగ, మంటలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది,  క్యాంపస్‌లో పిల్లలు ఉన్నారు.   ఎనిమిది ఫైర్‌ఫైటింగ్ యూనిట్లు 1:22 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) నుండి రెండు ప్లాటూన్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.  స్థానిక నివాసితులు, మైల్‌స్టోన్ కాలేజీ విద్యార్థులు కూడా రెస్క్యూ ప్రయత్నాలలో సహాయపడ్డారు.  

బంగ్లాదేశ్ ఆర్మీ క ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విమానం F-7 BGI శిక్షణా విమానమని, అది వైమానిక దళానికి చెందినదని ఒక సంక్షిప్త ప్రకటనలో నిర్ధారించింది.  ఫైర్ సర్వీస్ అధికారి లిమా ఖానం ఒక వ్యక్తి మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు నిర్ధారించారు, అయితే గాయపడినవారు లేదా మరణించినవారు పౌరులా  లేదా సైనిక సిబ్బందా అనే వివరాలు ఇవ్వలేదు.

ప్రమాద కారణాన్ని నిర్ధారించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా, ఇది మెకానికల్ లోపం కావచ్చని అనుమానిస్తున్నారు,