Balochistan Liberation Army is hunting the Pakistan Army: పాకిస్థాన్ ఆర్మీకి బలూచిస్తాన్ కొరకరాని కొయ్యగా మారుతోంది. తిరుగుబాటుదారులు అయిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్ సైన్యంపై మరోసారి దాడులకు పాల్పడింది. తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. చాలామందికి గాయాపడ్డారు. మరో ప్రాంతంలో పాక్ ఆర్మీ, BLA మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. కొన్ని పట్టణాలపై BLA పట్టు సాధించింది.
బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడి ఆర్మీపై తిరుగుబాటు చేసారు. బలూచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీ వెళ్లిపోవాలని బీఎల్ఏ హెచ్చరికలు జారీ చేసింది.
తమకు స్వాతంత్రం కావాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆర్మీ పాల్పడుతున్న దారుణాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బలూచిస్తాన్, పాకిస్తాన్‌లో అతిపెద్ద విస్తీర్ణం, అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతం. సహజ వనరులు ఉన్నప్పటికీ, 70 శాతం జనాభా దారిద్ర్యంలో ఉంది. 1948లో పాకిస్తాన్‌లో బలవంతంగా విలీనం, వనరుల దోపిడీ, రాజకీయ ఉపేక్ష వంటి అంశాల కారణంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బలూచిస్తాన్‌లోని మంగుచోర్ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుందని, పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి, సైనికులను బందీలుగా పట్టుకుందని వార్తలు వస్తున్నాయి. BLA బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.