Mulugu News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భీమాకోరేగామ్ స్ఫూర్తి సందర్బంగా విజయ్ దివాస్ కార్యక్రమమం ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం వై జంక్షన్ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. అయ్యప్ప, శివ స్వాములు ఫంక్షన్ హాల్ కు చేరుకొని.. బైరి నరేష్ పై విరుచుకుపడ్డారు. అయ్యప్ప స్వామిని దూషించిన బైరి నరేష్ ఇక్కడ నుంచి పోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బైరి నరేష్ స్వాములకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాను గతంలో అయ్యప్ప భక్తులపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకున్నానని గతంలో చెప్పడంతో పాటు జైలుకు వెళ్లడం జరిగిందని బైరి నరేష్ వివరించారు. జైలుకు వెళ్లడంతో పాటు అనేక కేసులు నమోదయ్యాయని నరేష్ స్వాములకు చెప్పారు. అయినా స్వాములు వినకుండా బైరి నరేష్ ను అక్కడి నుంచి పంపించారు.
ఈ క్రమంలో బైరి నరేష్ వెళ్తున్న క్రమంలో నర్సింగరావు అనే అయ్యప్ప భక్తుడిని కాలుపై నుండి వెళ్లడంతో కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి బైరి నరేష్ తప్పించుకుని వెళ్తుండగా నరేశ్ కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో దానిని అక్కడే వదిలేసి నరేష్ అడవుల్లోకి పరారైనట్లు సమాచారం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన బైరి నరేశ్ గతంలో అయ్యప్ప స్వామి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లోనే ఆయనపై అయ్యప్ప భక్తులు, హిందుసంఘాల ప్రతినిధులు దాడి చేశారు.