Ram Mandir Pran Pratishtha: అయోధ్య ప్రారంభోత్సవ సందర్భంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. స్పేస్ నుంచి శాటిలైట్స్ ద్వారా అయోధ్య ఆలయాన్ని ఫొటోలు తీసింది. అవి సోషల్ మీడియా కనిపిస్తున్నాయి. Indian Remote Sensing శాటిలైట్స్ ద్వారా 2.7 ఎకరాల అయోధ్య ఆలయ స్థలాన్ని క్యాప్చర్ చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని గత నెల డిసెంబర్ 16న ఫొటో తీసి షేర్ చేసింది ఇస్రో. అయితే..అప్పటి నుంచి మంచు కమ్మేయడం వల్ల మరోసారి ఫొటోలు తీసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు సరిగ్గా ఉత్సవానికి ఒక రోజు ముందు శాటిలైట్ ఇమేజెస్‌ని వైరల్ అవుతున్నాయి. అందులో దశరథ్ మహల్‌తో పాటు సరయూ నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్‌నీ చూడొచ్చు. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్‌కి చెందిన 50 ఉపగ్రహాలున్నాయి. ఈ ఇమేజెస్‌ని హైదరాబాద్‌లోని National Remote Sensing Centre ప్రాసెస్ చేసింది. ఆలయ నిర్మాణంలో ఇస్రో టెక్నాలజీలనూ వినియోగించారు. బాల రాముడి విగ్రహాన్ని సరిగ్గా ఎక్కడ ప్రతిష్ఠించాలో తెలుసుకోవడమే అసలు సవాలుగా మారింది. ఈ విషయంలో ఇస్రో టెక్నాలజీ చాలా సహకారం అందించింది. రాముడు ఎక్కడైతే పుట్టాడని భావిస్తున్నారో కచ్చితంగా అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించింది ట్రస్ట్. ఈ లొకేషన్‌ని గుర్తించేందుకు Larsen & Toubro కంపెనీ Global Positioning System (GPS) సహకారం తీసుకుంది. ఎక్కడ గర్భ గృహాన్ని నిర్మించాలో గుర్తించింది. ఇందుకోసం ఇస్రో తయారు చేసిన Navigation with Indian Constellation సహకారం తీసుకుంది. దీన్నే స్వదేశీ GPSగానూ పిలుస్తున్నారు. ప్రస్తుతానికి 5 NAvIC శాటిలైట్స్ వర్కింగ్ కండీషన్‌లో ఉన్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇటీవలే వెల్లడించారు.
Ram Mandir: అంతరిక్షం నుంచి అయోధ్య ఎలా కనిపిస్తోందో చూశారా- ఇస్రో ఫొటోలు వైరల్
Ram Manohar
Updated at:
21 Jan 2024 11:51 AM (IST)
Ramlala Pran Pratishtha: స్పేస్ నుంచి అయోధ్య ఎలా కనిపిస్తోందో ఇస్రో శాటిలైట్స్ క్యాప్చర్ చేశాయి.
స్పేస్ నుంచి అయోధ్య ఎలా కనిపిస్తోందో ఇస్రో శాటిలైట్స్ క్యాప్చర్ చేశాయి.
NEXT
PREV
Published at:
21 Jan 2024 11:51 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -