Attack on an IAF Wing Commander couple in Bengaluru: బెంగళూరు విమానాశ్రయం సమీపంలో భారత వైమానిక దళ (IAF) అధికారి వింగ్ కమాండర్ అదిత్య బోస్, ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత దాడికి గురయ్యారు. బెంగళూరులోని సీవీ రామన్ నగర్‌లోని DRDO కాలనీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. కన్నడలో దూషలు మొదలు పెట్టి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో బోస్ భార్య మధుమితను కూడా అవమానకరంగా మాట్లాడాడు.
అకారణంగా ఎందుకు దూషిస్తున్నాడో వింగ్ కమాండర్ ఆదిత్యబోస్ కు అర్థం కాలేదు. ఆయన విషయం తెలుసుకుందామని బయటకు వచ్చినప్పుడు బైక్ కీతో బోస్ నుదుటిపై దాడి చేశాడు ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ఓ వ్యక్తి ఒక వ్యక్తి రాయితో బోస్ తలపై కొట్టాడు. స్క్వాడ్రన్ లీడర్ మధుమితపైనా దాడి చేసే ప్రయత్నం చేశారు.
తనకు జరిగిన ఘటనపై ఆదిత్య బోస్ బోస్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దేశాన్ని రక్షించే సైనికులమని ఇలా దాడి చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశాడు. బోస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి తగిన స్పందన లేదని ఆయన ఆరోపించారు.
బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి ట్రాఫిక్ వివాదం కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో పౌరుల భద్రతపై ఇది సందేహాలు లేవనెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి.