Election 2022 Date Announcement LIVE: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను శనివారం ప్రకటిస్తుంది.
ABP Desam Last Updated: 08 Jan 2022 04:41 PM
Background
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలనే వివిధ పార్టీలు కోరుతున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం శనివారం...More
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలనే వివిధ పార్టీలు కోరుతున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం శనివారం 5 రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం ఈసీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు. 7 దశల్లో ఎన్నికల నిర్వహణ మెుదటి దశ పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 10రెండో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 14(పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్)మూడో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20నాలుగో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 23ఐదో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27(మణిపూర్)ఆరోదశ పోలింగ్ తేదీ : మార్చి 3(మణిపూర్)ఏడో దశ పోలింగ్ తేదీ : మార్చి 7 కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గించామని సీఈసీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవపరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలకు అనుమతి కోవిడ్ కారణంగా జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించామని సీఈసీ తెలిపారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేసినట్లు తెలిపారు. పాదయాత్రలు, రోడ్ షోలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. డబుల్ వ్యాక్సిన్లు తీసుకున్నవారినే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నామని సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు
ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.