Scooters for Meritorious Students: 


ప్రతిభావంతులకు గిఫ్ట్..


అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. 12th స్టాండర్డ్ పాస్ అయిన వారిలో 36 వేల మంది విద్యార్థులను గుర్తించి వారికి స్కూటర్‌లు కానుకగా ఇవ్వనుంది. వీరిలో ఎక్కువగా లబ్ధి పొందేది బాలికలే. కేబినెట్ మీటింగ్‌లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయం ప్రకటించగా..అందరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ఇదే విషయాన్ని ప్రకటించారు. రూ.258.9 కోట్ల వ్యయంతో ప్రతిభావంతులకు స్కూటర్లు పంచేందుకు వీలుగా కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు. మొత్తం 35,800 మంది లబ్ధిదారులున్నట్టు వెల్లడించారు. వారిలో 29 వేల 768 మంది బాలికలు ఫస్ట్ డివిజన్‌లో పాస్‌ కాగా...6,052 మంది బాలురు 75% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారని స్పష్టం చేశారు. వీరందరికీ స్కూటర్లు అందించనుంది ప్రభుత్వం. అంతే కాదు. తరవాతి చదువులకూ పూర్తి సహకారం అందిస్తామని చెప్పింది. ఇన్సూరెన్స్‌ కోసం అవసరమయ్యే మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. ప్రావిన్షియల్ కాలేజ్‌లలో ఫిక్స్‌డ్ శాలరీకి పని చేస్తున్న అసిస్టెంట్ టీచర్ల నెలవారీ జీతమూ పెంచుతున్నట్టు ప్రకటించింది. నెలకు రూ.55 వేల వరకూ జీతం వచ్చేలా పెంచుతున్నట్టు విద్యాశాఖమంత్రి రనోజ్ పెగు వెల్లడించారు. కజిరంగాలో ఓ హోటల్‌ను నిర్మించాలనీ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించారు.  Saraf Hotel Enterprises ఆధ్వర్యంలో ఈ హోటల్‌ను నడిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కజిరంగలో హోటల్స్‌ నిర్మించటం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అసోం ప్రభుత్వం భావిస్తోంది. 


సీఎంకు సెక్యూరిటీ పెంపు..


అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆయనకు Z కేటగిరీ భద్రత ఉండగా.. దాన్ని Z Plusకి అప్‌గ్రేడ్ చేసింది. ఆయనకు ప్రస్తుతం Central Reserve Police Force (CRPF) Z కేటగిరీ భద్రత అందిస్తోంది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటి నుంచి జెడ్ ప్లస్‌ భద్రత అందించనుంది. కేంద్ర భద్రతా సంస్థలతో చర్చించిన తరవాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బిశ్వశర్మకు భద్రత పెంచటం మంచిదని సూచించగా...వెంటనే అమలు చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా ఇదే భద్రత ఆయనకు లభిస్తుంది. హిమంత బిశ్వశర్మ ఇప్పటి నుంచి ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట 50 మంది కమాండోలు ఉంటారు. 2017లో శర్మకు Z కేటగిరీ భద్రతనిచ్చిన కేంద్రహోం శాఖ, రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే భద్రత ఇవ్వనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి Z ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతినిస్తుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇది దృష్టిలో ఉంచుకుని...ఇంటిలిజెన్స్ వర్గాల సూచన మేరకు ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 


Also Read: Bengaluru IMD Alert: మరోసారి బెంగళూరుని ముంచెత్తుతున్న వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ