Savarkar Remark: వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాజాగా స్పందించారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీకి భారతదేశ చరిత్రపై అవగాహన లేదు. వీర్ సావర్కర్‌పై రాహుల్ వాడిన పదాలు ఆయన భావజాలాన్ని వెల్లడిస్తున్నాయి. ఆయన దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి. ప్రజలు దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు. - హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
రాహుల్ ఏమన్నారు?
'భారత్ జోడో యాత్ర'లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు.
భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు సావర్కర్ ఓ చిహ్నం. అండమాన్ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్ వారికి అర్జీలు పెట్టుకున్నారు. సావర్కర్ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారు. బ్రిటీషర్ల నుంచి పింఛన్ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సావర్కర్ పనిచేశారు. బ్రిటీషర్లకు భయపడి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నేతలను సావర్కర్ మోసం చేశారు. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
శివసేన రియాక్షన్
ఈ వ్యవహారంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
సావర్కర్‌పై ఆయన వ్యాఖ్యలను అంగీకరించబోను. సావర్కర్ అంటే మాకు ఎనలేని అభిమానం ఉంది. అది ఎన్నటికీ చెదిరిపోదు. మమ్మల్ని విమర్శించే ముందు.. జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో కలిసి అధికారం పంచుకున్నారో లేదో భాజపా సమాధానం చెప్పాలి. - ఉద్ధవ్ ఠాక్రే, శివసేన
మహారాష్ట్రలో మొన్నటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని నడిపారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు.
Also Read: Gujrat Elections 2022: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఈసీ సీరియస్- ఐఏఎస్ అధికారిపై వేటు!