Artificial Rain in Delhi: ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం మంగళవారం అక్టోబర్ 28, 2025 నాడు ఢిల్లీలో మొదటిసారిగా మేఘ మథనం ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల ప్రకారం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే త్వరలోనే వర్షాలు కురవచ్చని తెలిపారు.
ఈ ప్రయోగం ఢిల్లీలో దీపావళి తర్వాత ఏర్పడిన కాలుష్య మేఘాలను నియంత్రించడానికి, చలికాలంలో మరింత తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రయత్నం. "ప్రస్తుత వాతావరణం, మేఘాల పరిస్థితులపై ఆధారపడి త్వరలోనే వర్షాలు కురవచ్చు" అని అధికారులు చెబుతున్నారు.
క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?
క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణ మార్పు టెక్నిక్. మేఘాల్లో సాంకేతికంగా మథనం నిర్వహించడం ద్వారా అంటే సెల్వర్ ఐయోడైడ్ వంటివి వేసి వర్షాలు కురిపిస్తారు. ఈ ప్రక్రియలో తగిన వాతావరణం ఉండాలి. దట్టమైన మేఘాలు ఉండాలి. అనుకూల పరిస్థితులు ఉంటే, కొన్ని గంటలు లేదా రోజుల్లో కృత్రిమ వర్షాలు కురిపించి, ఢిల్లీలో కాలుష్య సమస్యకు తాత్కాలిక ఉపశమనం కల్పించవచ్చని భావిస్తున్నారు.
కాన్పూర్ నుంచి విమానం, బురారీలో ట్రయల్
ఈ ప్రయోగానికి ఉపయోగించిన విమానం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి మంగళవారం ఉదయం బయలుదేరింది. ఇది ఢిల్లీ ఉత్తర-పశ్చిమంలోని బురారీ ప్రాంతంలోకి మళ్లింది, అక్కడ ప్రయోగం జరిగింది. మొదట కాన్పూర్‌లో తక్కువ విజుబులిటీ కారణంగా విమానం ఆలస్యమైంది. కానీ వాతావరణం మెరుగుపడిన తర్వాతటేకాఫ్ అయిందని అధికారులు తెలిపారు.
[/ దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతోంది. వింటర్ సీజన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కాలుష్యం, పొగలు ఢిల్లీ నగరాన్ని కట్టిపడేస్తున్నాయి. ఈ కృత్రిమ వర్షాలు వాయు కాలుష్యాన్ని కొంతమేర తగ్గించి, పౌరులకు ఉపశమనం కల్పించవచ్చు.
ఈ ప్రయోగం విజయవంతమైతే, ఢిల్లీలో రెగ్యులర్‌గా క్లౌడ్ సీడింగ్‌ను అమలు చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్యల ద్వారా పర్యావరణ సమస్యలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తోంది. పౌరులు మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.