Poonch Terror Attack: 



ఉగ్రదాడి..


జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను మొహరించారు. ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. గత నెల కూడా పూంఛ్‌లోనే ఆర్మీపై దాడి చేశారు ఉగ్రవాదులు. Dera Ki Gali ప్రాంతం వద్ద ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఈ ఏరియా ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. పొంచి ఉండి దాడులు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే ప్రాంతంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 10 మంది సైనికులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 2003-21 మధ్య కాలంలోనే పూంఛ్ ఉగ్రవాదుల స్థావరంగా మారింది. ఈ ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్‌ చేపడుతోంది ఆర్మీ. ఈ క్రమంలోనే పదేపదే ఉగ్రదాడులు జరుగుతున్నాయి.