AP Telangana News Live Updates: రమ్య హత్యపై కూడా రాజకీయాలా.. మీ హయాంలో ఏం చేశారు.. ఏపీ హోంమంత్రి సూటిప్రశ్న
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబిత కీలకంగా వ్యవహరించారని సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది.
రమ్య హత్యను సైతం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దిశా చట్టాన్ని ప్రచార ఆర్భాటాలకు వాడుకోవాలని చూస్తున్నారంటే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జాతిలో పుట్టాలా అనే తరహా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు నేడు దళితుల కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని విమర్శించారు.
ఏపీలో ఇటీవల స్కూళ్లు తెరుచుకోగా, పాఠశాలలో కొవిడ్19 నిబంధనలు తప్పకుండా పాటించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు కనిపించిన వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. అర్హులైన వారందరూ టీకాలు తప్పకుండా వేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా వారికి సూచనలు ఇవ్వాలన్నారు.
తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మనోహరాబాద్‌లో కలుషిత ఆహారం తినడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి సైతం అస్వస్థతకు గురైంది. ఆ మహిళను చికిత్స నిమిత్తం తుప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రాక్టర్‌పై గ్రామాలలో పర్యటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలంలో సొంతంగా ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు. ప్రజలు తమ సమస్యలను స్పీకర్ పోచారానికి విన్నవించుకున్నారు. రైతులను పలకరించిన పోచారం.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీ ప్రభుత్వంలో విలీనం తరువాత సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టాలని భావిస్తున్నారు. విలీనానికి ముందు కార్మికులకు అందుతున్న ప్రయోజనాల్లో కోత విధించడం అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు నేటి ఉదయం కార్మిక సంఘాల నేతల మధ్య విజయవాడలో చర్చలు జరిగాయి.
Background
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబిత కీలకంగా వ్యవహరించారని సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -