AP Telangana Today Updates: గాంధీ ఆసుపత్రిలో దారుణం... అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం!

గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం చేశారని చిలకలగూడ పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

ABP Desam Last Updated: 16 Aug 2021 05:41 PM

Background

తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో...More

గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కా, చెల్లెళ్లపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం!

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం  చోటుచేసుకుంది.  ఉమామహేశ్వర్‌రావు అనే ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసినట్టు బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బావ చికిత్స కోసం వచ్చిన అక్కచెల్లెళ్లను గదిలో బంధించి మత్తు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గది నుంచి తప్పించుకున్న చెల్లి, అక్క ఆచూకీ ఇంకా తెలియాల్సిఉంది.