Breaking News Live Telugu Updates: భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకన్న నగరంతో కలిపాం: మోదీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Apr 2023 01:01 PM

Background

కాసేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలో ఎప్పుడు ఎంటర్ అవుతారు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...More

భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకన్న నగరంతో కలిపాం: మోదీ

తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ. 11వేల కోట్ల అభివృద్ధిపనులు చేపట్టాం. తెలంగాణ అభివృద్ధి చేసే భాగ్యం కలిగింది. తెలంగాణ పోరాటంలో సామాన్యులు ఎన్నో త్యాగాలు చేశారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరాన్ని వందేభారత్‌తో కలిపాం. :