Breaking News Live Telugu Updates: సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 06 Dec 2022 08:42 PM
Background
AP Weather Report: అనుకున్నట్టే అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారబోతుందని భారత్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఈ తుపాను పయనించనున్నట్లు వివరించింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా పడనున్నట్లు ప్రకటించింది....More
AP Weather Report: అనుకున్నట్టే అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారబోతుందని భారత్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఈ తుపాను పయనించనున్నట్లు వివరించింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా పడనున్నట్లు ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఈనెల 8వ తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి - దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను... ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరులో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు..వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈనెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన "మాండూస్" అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఈనెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో అల్ప పీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. తెలంగాణ వెదర్ రిపోర్టు ఇలా.. తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. చలి తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉందన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి - కొత్తగూడెం వంటి తూర్పు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగర శివార్లలో విస్తృతంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా హైవేలపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.