= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Hetero Labs: హెటిరో ల్యాబ్స్ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి ప్రొడక్షన్ ఆపరేటర్ మృతి జీడిమెట్ల పీఎస్ పరిధిలోని హెటిరో ల్యాబ్స్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదవశాత్తూ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి ప్రొడక్షన్ ఆపరేటర్ మహేందర్ (28) పడి మృతి చెందాడు. నిజామాబాద్ కి చెంది మహేందర్ గత మూడు సంవత్సరాలుగా హెటరో ఫార్మా యూనిట్ 3లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మిక్స్ డ్ యంత్రంలో కెమికల్ ను మార్చే క్రమంలో మహేందర్ కు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేందర్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Siddipet News: మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 5 వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్ కు రానున్న మంత్రి కేటీఆర్ మినీ స్టేడియంలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడే సమీపంలో ఉన్న ఇండోర్ స్టేడియం, డిగ్రీ కళాశాల, ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ, బస్తీ దావకాన, టిటిసి బిల్డింగ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించడంతోపాటు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అక్కడినుండి స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారని, మొట్టమొదటిసారి హుస్నాబాద్ కు వస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటనను నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Tirupati District News: అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పోలీసులు సత్యవేడు మండలంలో జరిగిన రెండు చోరీ కేసులలో గని భాష అనే నిందితుడిని సత్యవేడు పోలీసులు అరెస్టు చేసారు.. అతని వద్ద నుండి 92.5 గ్రాముల బంగారం 700 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.. ఈ సందర్బంగా పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సత్యవేడు మండలంలో గతంలో రెండు చోరీలు జరగడంతో దీనిపై నిఘా పెట్టిన పోలీసులు..సీఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో ఈరోజు అనుమానాస్పదంగా ఆటో నడుపుకుంటూ తమిళనాడు నుండి సత్యవేడు వైపుకు వస్తున్నావు వ్యక్తిని గమనించిన ఎస్సై పురుషోత్తం రెడ్డి అదుపులో తీసుకొని విచారించగా ఈ ప్రాంతంలో జరిగిన చోరీలు తానే చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేశారు.. తమిళనాడుకు చెందిన నిందితుడు గని భాష పై ఆంధ్ర మరియు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయి గతంలో జైలుకు కూడా పోయి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు అతని వద్ద నుండి 3,58,000 రూపాయలు విలువగల బంగారం వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం భాషాను రిమాండ్ కు తరలించారు. ఈ కేసును చేదించడంలో కృషిచేసిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, వారి సిబ్బందిని ప్రశంసించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల కాసేపటి క్రితం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు. కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం కన్నుమూశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
షూటింగ్‌లో గాయపడ్డ చియాన్ విక్రమ్- పక్కటెముకులు విరిగినట్టు సమాచారం తంగళన్ షూటింగ్ టైంలో చియాన్ విక్రమ్ గాయపడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో విక్రమ్ పక్కటెముకులు విరిగినట్టు కూడా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో విక్రమ్ నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2లో ఆదిత కరికాలన్ పాత్రలో చియాన్ విక్రమ్ అలరించాడు.