Breaking News Live Telugu Updates: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 03 Jan 2023 10:19 PM
Background
కందుకూరు, గుంటూరు తొక్కిసలాటతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుంతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. రేర్ కేస్‌లలో...More
కందుకూరు, గుంటూరు తొక్కిసలాటతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుంతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. రేర్ కేస్‌లలో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని సూచించింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ర్యాలీలు. కారణంగా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రజలు బలవుతున్నారని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు ప్రజల రాకపోకలకు, సరకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని.... సభలు సమావేశాల కోసం వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాలు యూజ్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో రోడ్లపై ర్యాలీలకు అనుమతి ఇస్తారంటే..అత్యంత అరదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే పర్మిషన్ ఇవ్వొచ్చు. నిర్వాహకులు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. లిఖిత పూర్వకంగా ఏ ఉద్దేశంతో సభ పెడుతున్నారో చెప్పాలి. టైమింగ్ చెప్పాలి. కచ్చితమైన రూట్ మ్యాప్ కూడా ఇవ్వాలి. ఎంతమంది సభకు వస్తున్నారో వివరంగా తెలపాలి. వీటన్నింటిపై సంతృప్తి చెందితే పోలీసులు అనుమతి ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహింతకూడదని ఏపీ సీఎం జగన్ జీవో ఇవ్వడం దుర్మార్గమని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీ హక్కు అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ తెలిపారు. వాస్తవాలుకు భిన్నంగా, రాజకీయ కోణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎవరూ రోడ్లపైకి రాకూడదని నిషేధించడం విచిత్ర నిర్ణయం అని అన్నారు. తప్పు చేసిన వ్యక్తులు, పార్టీపై చర్యలు తీసుకోండని సూచించారు. కానీ ఇలా సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపొద్దని చెప్పొదంటూ ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని వైసీపీ సర్కారు జీవో ఇవ్వటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి జగన్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయం ఇది అని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా అని ఎసీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామంటున్నారని... వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా అని రామకృష్ణ ప్రశ్నించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియ, సుబేదారి ఎస్ఐ పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.