వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Feb 2023 06:46 PM

Background

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Viswanath) ఇకలేరు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా...More

జగన్ వెంటే నడుస్తానంటూ కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేసిన కార్పొరేటర్

నెల్లూరు రూరల్ లో ఆధిపత్య పోరు మొదలైంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటే అందరు కార్పొరేటర్లు ఉంటారనుకుంటే సడన్ గా ఆ లెక్కలు మారాయి. జై జగన్, జై ఆదాల అంటూ కొందరు తిరుగుబాటు స్వరం వినిపించారు. దీంతో కోటంరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తన మాట విననంటున్న కార్పొరేటర్ల ఇంటికెళ్లి రాయబారం నడిపించాలనుకున్నారు. కానీ వాళ్లు తిరగబడ్డారు. తమని బెదిరిస్తున్నారంటూ ఏకంగా ఓ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి. తాను జగన్ వెంట నడుస్తానని ఎంపీ ఆదాలకు మద్దతు పలికారు. దీంతో కోటంరెడ్డి మధ్యాహ్నం తన ఇంటికొచ్చారని, తనపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది కోటంరెడ్డే అయినా, తాను జగన్ పార్టీపై గెలిచానని, ఆయనతోనే ఉంటానన్నారు. పోలీసులు ఈ వ్యవహారం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామన్నారు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి