Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Dec 2022 07:23 PM

Background

ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ విచారణకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను పిలవడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. ఎప్పటి నుంచో ఈ కేసులో ఆమె ఉన్నట్టు ప్రచారం జరిగినా... దాన్ని టీఆర్‌ఎస్‌ ఖండిస్తూ వచ్చింది. కానీ మొన్నటికి మొన్న ఈడీ...More

దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

దిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ మేరకు కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా కాపీ అందించాలని కోరారు. దిల్లీ మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది.