Breaking News Live Telugu Updates: అధికారుల్ని డిమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Background
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అదే తీవ్రతతో నెమ్మదిగా కదులుతోంది. 24గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు రానుంది. ఇది గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య...More
అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్ కుమార్
బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ
హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం.
* కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
* తెలంగాణ అధికారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం
* కేసీఆర్ చేసిన తప్పులకు అధికారులు బలి అవుతున్నారు
* బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ విద్యుత్ సంస్థల్ని నష్టాల పాల్జేశారు.
* ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కొత్త పే రివిజన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా కూడా ఉద్యోగులు కష్టపడి సంస్థలను కాపాడుకుంటున్నారు.
* ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వమంటే డిమోషన్ చేస్తున్నారు.
* డిమోషన్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి.
* బాధిత అధికారులు చేసే పోరాటానికి బిజెపి అండగా ఉంటుంది.