Breaking News Live Telugu Updates: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో అరెస్టు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 13 Dec 2022 09:23 PM

Background

Retail Inflation Data: భారత దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. 2022 అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation), నవంబర్‌లో మరింత తగ్గి 5.88 శాతానికి...More

ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో అరెస్టు

హైదరాబాద్ ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ గోవాలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మన్నెగూడలో యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం నల్గొండ వైపు కారులో తీసుకెళ్లి అక్కడ యువతిని వదిలేసి నవీన్ పరారయ్యాడు. యువతి కిడ్నాప్, ఆమె ఇంటిపై దాడి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.