Breaking News Live Telugu Updates:  విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Feb 2023 02:39 PM

Background

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం  వాయిదా పడింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంబించాలని ప్రభుత్వ భావించింది. దీని కోసం భారీ...More

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం - ద్రవ ఉక్కు పడి 9 మందికి గాయాలు

విశాఖ ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ SMS - 2లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ప్రమాదం జరిగింది. దీంతో ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి తరలించింది యాజమాన్యం.