Breaking News Live: ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 08 Jan 2022 10:09 PM
Background
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవను తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది....More
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవను తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దమ్మపేట, చింతలపూడి మధ్య పోలీసులు వనమా రాఘవేంద్రరావు(59)ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు గిరీష్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విపక్షాల నుంచి విమర్శలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ శుక్రవారమే రాఘవను సస్పెండ్ చేసింది.టీఆర్ఎస్ ఎమ్మెల్యే (కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవ బెదిరింపుల కారణంగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం జనవరి 3న ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తగా ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ తలదూర్చాడు. హైదరాబాద్‌కు భార్యను తీసుకొచ్చి అప్పగిస్తే ఆస్తి నీకు దక్కేలా చేస్తానని వనమా రాఘవ తనను బెదిరించాడని.. ఈ అవమానాలు తట్టుకోలేక కుటుంబంతో పాటు చనిపోయాతున్నానని రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, ఆపై తాను కూడా కాల్చుకుని బలవన్మరణం చెందాడు. రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో దుమారం రేపుతోంది.హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.35గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 46 పైసలు పెరిగింది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, 43 పైసలు పెరగడంతోడీజిల్ ధర రూ.94.78 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..ఇక విజయవాడలో పెట్రోల్ ధర 21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.29 అయింది. 17 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.36కు చేరుకుంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.30 అయింది. డీజిల్ ధర 0.19 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.41 అయింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్లపై రూ.350 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 కి క్షీణించింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,500కి పడిపోయింది.ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.350 మేర పతనమైంది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,600కు పడిపోయింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 కు క్షీణించింది. ఏపీ, తెలంగాణలో వెండి ధరలు ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: SBI Alert: బీ కేర్‌ఫుల్.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేయలేదని ఎస్‌బీఐ అకౌంట్స్ బ్లాక్ చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండిAlso Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. రూ.900 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మహేష్ బాబు ఇంట్లో విషాదం... ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా రమేష్ బాబు లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.