Breaking News: పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..
ABP Desam Last Updated: 13 Dec 2021 06:55 PM
Background
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు...More
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి వర్షాలు కురవనుండగా.. రేపు కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.తెలంగాణ వెదర్ అప్‌డేట్..నైరుతి బంగాళాఖాతంలో వీస్తున్న చల్ల గాలుల ప్రభావం కొంతమేర తెలంగాణలోనూ ఉంది. అయితే రాష్ట్రంలో ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పడిపోతాయని తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,210 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 13) రూ.0.27 పైసలు తగ్గి పెట్రోల్ ధర రూ.107.69 గా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.0.25 పైసలు తగ్గి రూ.94.14 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.95గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.59 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.96.01గా ఉంది. ఇది రూ.0.54 పైసలు పెరిగింది. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.15 పైసలు పెరిగి రూ.110.36 గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.96.45గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం
పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కు నివేదిక అందించామని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. 72 గంటల్లో సీఎం జగన్ పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.