Breaking News Live: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు
AP New Cabinet: ఏపీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11.31కి మంత్రులు ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఇదివరకే ఏపీ మంత్రి వర్గం రాజీనామా చేసింది. పాత మంత్రులలో దాదాపు 10 మందికి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పరిస్థితులు, సామాజిక వర్గాలు, నేతల పనితీరు ఇలా పలు అంశాలు పరిశీలించిన తరువాత సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో చోటు ఇవ్వనున్నారు.
Sri Lanka Central Bank Interest Rate: శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రెట్లను డబుల్ చేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ అధికారులు తెలిపారు.
పబ్‌లు అలా నడపాలంటే రాష్ట్రం వదిలి వెళ్లిపోండి - పబ్ నిర్వాహకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
పబ్ నిర్వాహకులు, ఎక్సైజ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం..
కొందరు చీడ పురుగులు వల్ల రాష్ట్రనికే చెడ్డపేరు. మా పార్టీ వ్యక్తి ఉన్నా వదిలేది లేదు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం. పబ్ అక్రమంగా నడపాలంటే వేరే రాష్ట్రం పోండి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రాణాలు తెగించి తెలంగాణా సాధించుకున్నాము. పబ్ లో డ్రగ్స్ సరఫరా సహించబోము. గీత దాటితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు..
పబ్ ను పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు కవర్ అవ్వాలి..
అలా కెమెరాలు ఏర్పాటు చేయని పబ్ ను మూసివేయండి...
పబ్ కెమెరాలను పోలీసులకు అనుసంధానం చెయ్యండి..
పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలి
పబ్ లో మంచి బ్రాండ్ లు.. మంచి ఫుడ్ అందుబాటులో ఉంచండి.. లైట్ మ్యూజిక్ ఒకే అని సూచించారు.
ప్రముఖ నటులు, సినీ దర్శక నిర్మాత మన్నవ బాలయ్య మరణం విచారకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. బాలయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిత ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు 50వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ లో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె తండ్రి, దివంగత నేత YSR విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం పడమటి తండా క్రాస్ నుండి షర్మిల పాదయాత్ర నేటి ఉదయం మొదలైంది.
Nadendla Manoher Condolences Balayya: బాలయ్య మృతిపట్ల నాదెండ్ల మనోహర్ సంతాపం
సీనియర్ నటుడు, దర్శకనిర్మాత బాలయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. బాలయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తూర్పుగోదావరి కోనసీమ జిల్లా
కోనసీమ జిల్లా బంద్ ను భగ్నం చేసిన పోలీసులు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఈరోజు బంద్ కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు.
ఉదయం అమలాపురం ఆర్టీసి డిపోకు చేరుకుని బస్సులు నిలుపుదల చేసే ప్రయత్నం చేసిన నిరసనకారులు.
నిరసనకారులను అదుపులోకి తీసుకుని ఉప్పలగుప్తం పోలీస్ స్టేషనకు తరలింపు.
అమలాపురంలో దుకాణాలు ముయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
దీంతో కోనసీమలో బంద్ పాక్షికంగా సాగుతోన్న బంద్..
జగన్ దళిత ద్రోహి అంటూ దళిత నాయకుల నినాదాలు...
అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని బోడసకుర్రు వైనతేయ బ్రిడ్జి వద్ద బైఠాయించిన నిరసనకారులు...
దీంతో బ్రిడ్జి వైపుగా స్తంభించి రాకపోకలు...
Senior Actor Balayya Passes Away: టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో ప్రముఖ నటుడు బాలయ్య తుదిశ్వాస విడిచారని సమాచారం. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. నటుడిగా వందల సినిమాల్లో తన ప్రతిభతో మెప్పించినా.. దర్శకుడిగా, నిర్మాతగానూ బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు, కానీ అదేరోజు విషాదవార్తను వినాల్సి వస్తుందని అనుకోలేదని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు.
Background
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్లో గుర్తుతెలియని దుండగులు బీభత్సం చేశారు. రైల్వే సిగ్నల్ కట్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ఆపి 9 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు డోన్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదులు బాధితులు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. రొటీన్‌కు భిన్నంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో కాకుండా ఏకంగా రైలులో చొరబడి దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. సెవెన్ హిల్స్ రైలు వెళ్తుండగా సిగ్నల్ వైర్ కట్ చేసిన కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుత్తి సమీపంలోని తురక పల్లి గ్రామం వద్ద రైలులోకి చొరబడ్డ దుండగులు ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అర్ధరాత్రి 1:30 ఈ సంఘటన జరగడం జిల్లాలో కలకలం రేపింది. వేసవికాలంలో దోపిడీలు జరుగుతాయని పోలీసులకు అంచనా ఉన్నప్పటికీ ముందస్తు నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. బాధితులు కర్నూలు జిల్లా డోన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత రెండు వారాల నుంచి పెరుగుతున్న ఇంధన వాహనదారులకు వరుసగా రెండోరోజు ఊరట కలిగించాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 9th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) దిగొచ్చింది. వరంగల్‌లో 44 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌పై 42 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.02 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 14 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.119.04 కాగా, డీజిల్‌పై 13 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.06 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 16 పైసలు పెరిగి, పెట్రోల్ ధర రూ.119.83 కాగా, 16 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.80కు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 9th April 2022)పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.61 కాగా, ఇక్కడ డీజిల్ పై 19 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.19 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 24 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.59 అయింది. డీజిల్‌పై 23 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.106.19గా ఉంది. చిత్తూరులో ఇంధన ధరలు నేడు పెరిగాయి. 32 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ రూ.122.39 కాగా, 29 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.107.86 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
వరుసగా రెండో రోజు బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.260 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,630 అయింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర రూ.300 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,300 కు ఎగబాకింది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.250 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 9th April 2022) 10 గ్రాముల ధర రూ.52,630 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,300 అయింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -