బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: తాను హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న సమయంలో తన కోసం, తన ఆరోగ్యం కోసం ఎన్నో ప్రార్ధనలు చేసిన ప్రతీ ఒక్కరికి, ప్రజలందరికీ ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్  కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి పినిపే విశ్వరూప్ అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత నియోజకవర్గ కేంద్రమైన అమలాపురానికి మొదటిసారిగా విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మధురపూడి విమానాశ్రయానికి తరలివెళ్లి స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ వాహనాల మధ్య సతీ సమేతంగా అమలాపురం చేరుకున్నారు. 
ప్రజలకు సేవకుడిగా అందుబాటులో ఉంటా..
ఇకనుంచి నిరంతరం మీ సేవకుడిగా ఉంటానని గుండె శస్త్ర చికిత్స అనంతరం మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆయన పస్తుతం అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రజలకు అంద బాటులో ఉంటానని చెప్పారు. దీంతో నియోజకవర్గం నలుమూలల నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తరలివచ్చి మంత్రి విశ్వరూప్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తన కోసం తన ఆరోగ్యం కోసం అహర్నిశలు మందిరాల్లోనూ, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ ఎన్నో ప్రార్ధనలు చేశారని, ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. శుక్రవారం నియోజకవర్గం వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో నిరంతరం అందరికీ సేవకునిగా, మీ అభిమాన నాయకునిగా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తానని విశ్వరూప్ స్పష్టం చేశారు. అందరికీ మరోసారి కృతజ్ఞతాభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు.
మంత్రి పినిపే విశ్వరూప్ వీడియో..
‘సెప్టెంబర్ 2న వర్దంతి రోజున అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం వెళ్లాను. ఆ తరువాత మీకు అందుబాటులో లేను. ఆపై నాకు బైపాస్ సర్జరీ జరిగింది. నేను హాస్పిటల్ లో ఉన్న సమయంలో మసీదులు, చర్చి, ఆలయాలలో పూజలు చేసిన, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నిన్న నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయిస్తున్నాను. ఇక నుంచి యథాతథంగా ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు సమస్యలు పరిష్కారం చేస్తూ నా కర్తవ్యాన్ని నిర్వరిస్తానని’ మంత్రి విశ్వరూప్ ఓ వీడియో సందేశం ఇచ్చారు.
ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్న మంత్రి విశ్వరూప్..
అమలాపురం: సెప్టెంబర్ తొలి వారంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ గుండె అస్వస్థతకు లోనయ్యారు. శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌ కు వెళ్లిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది, నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. కానీ మెరుగైన ట్రీట్మెంట్ కోసం విశ్వరూప్‌ గుండె శస్త్రచికిత్స చేయించుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో బయలుదేరి ముంబై వెళ్లారు. ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఆయనకు గుండె శస్త్రచికిత్స (Pinipe Vishwaroop Heart Surgery) చేశారని మంత్రి విశ్వరూప్‌ తనయుడు కృష్ణారెడ్డి ఇటీవల తెలిపారు. ఏషియన్‌ హార్ట్‌ సెంటర్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స జరిగిందని, తన తండ్రికి అక్కడి డాక్టర్లు బైపాస్ సర్జరీ చేసినట్లు కృష్ణారెడ్డి చెప్పారు.