11వ పీఅర్సీ(11th PRC) అమలుకు సంబంధించి, ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కొత్త జీవోలు జారీ చేసింది. హెచ్‌ఆర్‌ఏ(HRA) స్లాబ్‌లను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్‌సీ జీవోలను ప్రకారం 10, 12, 16, 24 శాతాలతో హెచ్ఆర్‌ఏ స్లాబ్ లను ఖరారు చేసింది. పెన్షనర్ల అడిషనల్ క్యాంటం ఆప్ పెన్షన్(Pension) సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన వేతనాలు, హెచ్‌ఆర్‌లో మార్పులు, పింఛన్ల సవరణ చేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి హెచ్‌ఆర్‌ఏ నూతన స్లాబ్ ల పెంపు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
11వ పీఆర్సీలో 16 శాతం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల ఒప్పందం మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తింపచేశారు. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠంగా రూ.25 వేలకు నిర్ధారించారు. ఏపీ భవన్(AP Bhavan), హైదరాబాద్(Hyderabad)లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. 2 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పే పైన 16 శాతం హెచ్‌ఆర్‌ఏ లేదా రూ.17 వేల సీలింగ్ విధించింది ప్రభుత్వం. 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ నిర్ధారించి, రూ.13 వేలు మించకుండా సీలింగ్ విధించింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం లేదా రూ.11 వేలు సిలింగ్ విధించింది. 2024 జూన్ 1వ తేదీ వరకు హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొంది. సీసీఏ కూడా హెచ్‌వోడీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖ, విజయవాడ, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు, 13 వేర్వేరు మున్సిపాలిటీలకు గ్రేడ్ పే(Grade Pay) ఆధారంగా నిర్ధారించారు.
పెన్షనర్లకు అడిషినల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్
- 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్
- 75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 12 శాతం పెన్షన్
- 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 20 శాతం పెన్షన్
- 85 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 25 శాతం పెన్షన్
- 90 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 30 శాతం పెన్షన్
- 95 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం పెన్షన్
- 100 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్