AP CM Jagan: దివగంత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ ఏపీ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతీ ఇంట్లో గొప్ప చదువులు చదవాలని వైఎస్సార్ ఎప్పుడూ కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిరంతరం తపించినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. అదే ప్రజలందరి హృదయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థానాన్ని సుస్థిరం చేసిందన్నారు. ఆయన ఆశయాల సాధనలోనే.. తన తండ్రి స్ఫూర్తే తనను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందన్నారు. అలాగే వైఎస్సార్ జయంతి తామందరికీ ఒక పండుగ రోజు అని చెప్పుకొచ్చారు.






ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాద్యమాల వేదికగా స్పందిస్తూ.. ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. అనునిత్యం ప్రజల శ్రేయస్సు గురించే తపించిన రాజన్న , జనం మదిలో ప్రజల మనిషిగా నిలిచారంటూ వివరిస్తున్నారు.  ఆ తండ్రి వారసత్వంగా రాజన్న బిడ్డగా.. సీఎం జగన్ ఈరోజు మంచి పాలన అందిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. 














ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతిని "రైతు దినోత్సవం" (రైతు దినోత్సవం)గా జరుపుకున్నారని గుర్తు చేశారు.