AP BJP leaders were given key responsibilities in the Maharashtra elections : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బాధ్యతలు అప్పగిస్తూ ఉంటుంది హైకమాండ్. గతంలో కర్ణాటక, తెలంగాణ సహా పలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేవారు. ఈ సారి మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏపీ బీజేపీ నుంచి ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి,  పీవీఎన్ మాధవ్‌లతో పాటు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న మధుకర్ ను మూడు ప్రాంతాలకు పరిశీలకులుగా నియమించారు. 


నాందెడ్ ప్రాంతానికి పరిశీలకునిగా విష్ణువర్ధన్ రెడ్డి         


తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నాందెడ్ ప్రాంతానికి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిని పరిశీలకునిగా నియమించారు. హైకమాండ్ ఆదేశాలతో నాందెడ్ వెళ్లిన ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర  ఎన్నికల్లో రైతులు ఓబీసీలు మెజారిటీ వర్గం మరాఠీ ఓటర్లు సైతం బిజెపి కూటమిని బలపరుస్తున్నారని ఆయన నమ్మకం వ్యక్తం చే్సతున్నారు. నిధులు రాష్ట్రానికి తీసుకురావడం, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించటం ఓటర్లు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 





 వాసిక్ పరిశీలనకునిగా పీవీఎన్ మాధవ్                           
 
మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు  దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తూంటారు. జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో పరిశీలనకునిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెళ్లారు. 


మరఠ్వాడాకు మధుకర్                        


ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు. పరిశీలకుని విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. ప్రచార సరళిని సమన్వయం చేయడం, అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం, ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం  చేయడం వంటివి చేస్తూంటారు. అభ్యర్థుల విజయంలో పరిశీలకుల విధులు కీలకంగా ఉంటాయని భావిస్తారు.