= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Annamayya District Latest News: అన్నమయ్య జిల్లాలో దారుణం- వర్షపు నీటిలో కొట్టుకుపోయిన స్కూల్ ఆటో- చిన్నారి గల్లంతు Annamayya District Latest News: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలకుస్కూల్ నుంచి వస్తున్న ఆటో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో సమయంలో ఆటోలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మున్సిపల్ పార్క్ వద్ద ఘటన జరిగింది. ఆరుగురు చిన్నారులను స్థానికులు రక్షించారు. మరో బాలిక కోసం గాలిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Warangal Latest News: వరంగల్ జిల్లా రఘనాథ్పల్లిలో కడియంకు వ్యతిరేకంగా పోస్టర్లు Warangal Latest News:వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లలో కడియం నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల చెమట కష్టం వల్ల ఎమ్మెల్యే పదవి దక్కిందని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి, తరువాత ఏ పార్టీ నుంచైనా పోటీ చేసుకోవాలని పోస్టర్ల ద్వారా బహిరంగంగా డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను విస్మరిస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు ఇలాంటి రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని స్పష్టం చేశారు.ఈ వాల్ పోస్టర్లతో రఘునాథపల్లి మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Maharashtra Latest News: పులి దాడిలో ముగ్గురు మృతి.. ఎక్కడంటే..? Maharashtra Latest News: తెలంగాణ సరిహద్దుల్లో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగిన ఈ పులుల దాడుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు, ఓ బాలుడు ఉన్నాడు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లాలో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో పులి దాడిలో లాఖపూర్ గ్రామానికి చెందిన సునీల్ రౌత్ (32) అనే పశువుల కాపరి మృతి చెందాడు. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో పశువులు మేపడానికి వెళ్లిన సునీల్ పై పొదల్లో దాక్కుని ఉన్న పులి దాడి చేసి చంపేసింది. చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్ (40) తన పొలంలో పనికి వెళ్లినప్పుడు ఆమెపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో మౌజా లావరీ గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సిందేవాహి తాలూకాలోని గడ్బోరి గ్రామంలో గురువారం రాత్రి ప్రశీల్ బాబన్ మంకర్ (9)అనే బాలుడిని ఇంటి ప్రాంగణం నుంచి చిరుత పులి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అటవీ ప్రాంతంలో బాలుడి మృత దేహం గుర్తించారు. ఈ ప్రాంతంలో వన్య ప్రాణులతో ముప్పు ఉందని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ Nirmal Crime News: నిర్మల్ జిల్లా కుబీర్‌లో పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్డిపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న రాత్రి కుబిర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డ్ గిరిపై అబ్దుల్ కలీం అనే మహారాష్ట్ర ధర్మబాద్ వ్యక్తి కత్తితో దాడి చేశాడన్నారు. అతన్ని ఇవాళ ఉదయం కుబిర్ శివారులో పట్టుకున్నామన్నారు. కుబీర్ లో అత్తవారింటికి వచ్చిన కలీం వారితో గొడవ పడ్డాడు. అత్తవారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా కలీం నేరుగా స్టేషన్ కు చేరుకొని పోలీసులపై కత్తితో దాడి చేయబోయాడని, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Adilabad Latest News: యూరియా కోసం రైతుల ఆందోళన,తోపులాట Adilabad Latest News: అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. నిత్యం యూరియా కోసం బారులు తీరడం, దొరికిన ఒక్క బస్తాతో తృప్తి పడుతున్నారు. రాత్రనక, పగలనక రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. తాజాగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రాథమిక సహకార సంఘం ఎదుట క్యూలో రైతులు, మహిళలు నిలబడ్డారు. పోలీసుల పహారాలో యూరియా పంపిణీ సాగుతోంది.
పోలీసులే టోకెన్లు ఇచ్చి రైతులకు యూరియా పంపిణీ జరిగేలా చూశారు. టోకెన్ల పంపిణీ చేస్తుండగా తమకు టోకెన్లు కావాలంటూ రైతులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఓ రైతు ఏఎస్ఐ మీద పడటంతో, ఆయన తూలి మహిళా రైతులపై పడబోయారు. దీంతో ఏఎస్ఐ రైతును తోసేశారు. ఇలా పలు చోట్ల యూరియా పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Telangana Latest News: 2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి Telangana Latest News: 2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు - కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు 4 కేటగిరీలుగా విభజించి తదనగుణంగా నిర్దేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేటగిరీ ఎ-లో 2002, 2025 రెండింటి జాబితా లోనూ ఒకే వ్యక్తి పేరు ఉన్నట్లయితే ఏ విధమైన డాక్యుమెంట్ అవసరం లేదని, ఈ చర్య స్పష్టంగా సరి పోలిన కేటగిరీగా పరిగణిస్తామని తెలిపారు. కేటగిరీ బి-2002 జాబితాలో పేరు లేదు, కానీ వ్యక్తి పుట్టిన సంవత్సరం 1987 కన్నా ముందు అయి ఉండాలని, అటువంటి వారు ఎన్నికల సంఘం సూచించిన 11 డాక్యుమెంట్లలో కనీసం ఒక్కటి సమర్పించాలని తెలిపారు .కేటగిరీ సి లో 2002 జాబితాలో పేరు లేదు, వ్యక్తి పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2002 మధ్య (తద్వారా 18 సంవత్సరాలు కన్నా తక్కువ వయస్సు) అటువంటి వారు ఒక స్వీయ డాక్యుమెంట్, కుటుంబ సంబంధిత డాక్యుమెంట్ మర్పించాలని తెలిపారు. కేటగిరీ డి- 2002లో పేరు లేదు, 2004 తరువాత జన్మించినవారు కానీ, 2025 జాబితాలో పేరు ఉందంటే ఒక స్వీయ డాక్యుమెంట్, తల్లిదండ్రుల డాక్యుమెంట్ తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. ఈ నెల 24వ తేదీగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలని తెలిపారు. నిర్దేశిత గడుపులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పిల్లలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను ఎన్నికల విభాగం అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తామని తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Adilabad Latest News: ఆరు గ్యారెంటీలపై వినూత్న ప్రచారం Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్ర (కే) గ్రామంలో ప్రభుత్వ 6గ్యారెంటీలపై వినూత్న రీతిలో ప్రచారం చేశారు. 6 గ్యారంటిలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను పథకాల వారీగా ఏ విధంగా మోసం చేసిందో గ్రామంలో ఇంటిటీకి, గ్రామంలో గోడలపై వాల్ పోస్టర్ లను మాజీ సర్పంచ్ మీనాక్షి అంటించి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు ఏ విధంగా మోసం చేసిందో మహాలక్ష్మి పథకం 2500,తులం బంగారం, 4000 పింఛన్, ఆడపిల్లలకు స్కూటీలు, సంపూర్ణ రుణమాఫీ, 15000 రైతు భరోసా, పథకాల వాల్ పోస్టర్‌ను గ్రామంలో అతికించి మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతొ ప్రజలను మోసం చేసింది అని, ఒక పథకం కూడా సరిగ్గా అమలు చెయ్యక ప్రజలను మోసం చేసిందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తానని చెప్పి అధికారంలో వచ్చి 22 నెలలు అవుతున్న ఇంకా పూర్తిగా హామీలు అమలు చేస్తలేదని, అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, ఇంటిటీకి తిరిగి బోర్డలను పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Hyderabad Rain:హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన- మరోసారి మునిగిన నగరం Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోత వాన పడుతోంది. హయత్ నగర్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో పడుతున్న వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకదాటిగా అరగంట నుంచి జోరు వాన దంచి కొడుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Balli Kalyana Chakravarthy :సొంత ఇంటికి రావడం ఆనందంగా ఉంది: బల్లి కల్యాణ చక్రవర్తి Balli Kalyana Chakravarthy resigned from YSRCP and joined TDP : వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన బల్లి కల్యాణ చక్రవర్తి సొంత గూటికి రావడం ఆనందంగా ఉంది అన్నారు. "పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి 13 నెలలు అయింది. మా రాజీనామాలు ఆపి...ఆమోదించకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం కోసం టీడీపీలో చేరాము." అని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Hyderabad Latest News: వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై కొనసాగుతున్న ఐటీ దాడులు Hyderabad Latest News: హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ. ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాసవి కార్యాలయంలో క్షణంగా తనీఖీలు చేస్తున్నారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అనర్హత వేటు వేస్తారో? రాజీనామా ఆమోదిస్తారో: మర్రి రాజశేఖర్ సోమవారం మండలికి వెళ్తామన్నారు టీడీపీలో జాయిన్ అయిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీు చెప్పారు. డిస్ క్వాలిఫై చేస్తారో...రాజీనామా అమోదిస్తారో చూద్దామని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Marii Rajasekhar On TDP: పాలన బాగుంది- ప్రజలకు మేలు జరుగుతుంది: మర్రి రాజశేఖర్ Marii Rajasekhar On TDP: టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మాట్లాడిన మర్రి రాజ్ శేఖర్....నేను మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చెప్పారు. 6 నెలలైంది. మా రాజీనామాలు మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. మండలి చైర్మన్ వెనక ఉండి నడిపించే వారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదు. ఆమోదిస్తారని నమ్మకం లేదు.సీఎం చంద్రబాబు నాయకత్వం లో పాలన బావుంది. ప్రభుత్వ పథకాలు. ప్రజలు బాగా తీసుకుంటున్నారు. అమరావతి లో అభివృద్ధి జరుగుతోంది. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి." అని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
YSRCP MLCs join to TDP : సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ YSRCP MLCs join to TDP : టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్ పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మర్రి రాజ్ శేఖర్....నేను మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చెప్పారు. 6 నెలలైంది. మా రాజీనామాలు మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. మండలి చైర్మన్ వెనక ఉండి నడిపించే వారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదు. ఆమోదిస్తారని నమ్మకం లేదు." అని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Vijay : విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు- బాంబు స్క్వాడ్ తనిఖీలు Vijay : తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నివాసంలో ఆగంతకుడు ప్రవేశించాడు. టెర్రాస్‌పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. అతని గురించి పోలీసులు విచారిస్తున్నారు. ముందు జాగ్రత్తగా విజయ్ ఇంట్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Revanth Reddy In Delhi: హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: రేవంత్‌రెడ్డి న్యూఢిల్లీ: హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరిస్తూనే.. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు అవసరం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ‘తెలంగాణ రైజింగ్ 2047’ రూపొందించుకున్నట్లు ఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
యాపిల్ స్టోర్ల వద్ద భారీగా క్యూలైన్లు, ముంబైలో కొట్టుకున్న కస్టమర్లు ముంబై: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుండి ఐఫోన్ 17 విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీంతో, యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో, కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కానీ, భద్రతా సిబ్బంది తక్షణమే జోక్యం చేసుకొని పరిస్థితిని కట్టడి చేశారు, దీంతో ఎలాంటి గొడవలు లేకుండా విక్రయాలు కొనసాగినట్లు సమాచారం. అలాగే, దిల్లీలోని యాపిల్ స్టోర్ ముందు కూడా చాలా మంది కొనుగోలుదారులు గుమిగూడారు, అక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కోకాపేటలో కత్తితో దాడి చేసి భర్తను హతమార్చిన భార్య.. రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో దారుణం జరిగింది. కత్తితో దాడిచేసి భర్తను భార్య హత్య చేసింది. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త కేకలు విని స్థానికులు అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలను అస్సాంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి అరెస్టు మదనపల్లె మాజీ ఆర్డీవో ఎం.సాకప్ప మురళిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నగరంలోని తన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు మురళికి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది.
గతేడాది జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ దహనం ఘటనలో పలు ముఖ్యమైన రికార్డులు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఈ కేసులో మురళి పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
2022 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పని చేసిన మురళి, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దగ్ధం అయ్యే విషయంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నేడు టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు టీడీపీలో చేరనున్నారు. గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైసీపీ పార్టీ సభ్యత్వానిక, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా వైసీపీ నుంచి బయటకొచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
AP Assembly Sessions: మెడికల్ కాలేజీకి 5 వేల కోట్లు ఖర్చు పెట్టలేరా? ప్రభుత్వానికి బొత్స సూటిప్రశ్న అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన చేశారు. పి పి పి విధానాన్ని, జి ఓ 501 రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 10 మెడికల్ కాలేజీలు కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విమర్శించారు. మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరం అయినా వెళ్తాం. ప్రైవేట్ వ్యక్తుల కోసం చంద్రబాబు పిపిపి మోడల్ విధానాన్ని తెచ్చారు. చేతకాకే ప్రైవేటీకరణ చేస్తున్నారు. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చుపెట్టినప్పుడు మెడికల్ కాలేజీకి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేరా? అని బొత్స ప్రశ్నించారు.