Breaking News Live Updates: ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు అనుమతి
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆదేశాలు ఇవ్వాలని ఓయూ వీసీని ఆదేశించింది.
Paddy Procurement In India: వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ అగ్రస్థానంలో లేదనే అక్కసుతో రైతులపై కేంద్రం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిందని, రా రైసే తీసుకుంటామని మొండికేసీనా 3000 కోట్ల పైచీలుకు నష్టాన్ని భరించి ధాన్యం కొంటున్నారు సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కానీ, నేడు ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను ఆపేలా కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. సౌకర్యాలు లేవని, గన్నీలు లేవని అసంబద్ద ఆరోపణలు చేస్తున్నారని, దీటుగా స్పందించి మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేశారు.
కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు మిల్లులకు ధాన్యం చేరవద్దనే ప్రస్థుతం పిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అకాల వర్షాలకు తోడు రైతులకు త్వరగా డబ్బులు రాకుండా, ధాన్యం కొనకుండా అడ్డుకునేలా కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్రం ఒక్క బ్యాగు ఇవ్వకున్నా 7.77 కోట్ల గన్నీలు అందుబాటులో ఉంచామన్నారు. ఒకరిద్దరు మిల్లర్లు చేసే అక్రమాలు బూచీగా చూపి కొనుగోళ్లను అడ్డకోవడం సమంజసమేనా, తప్పుచేసిన మిల్లర్లపై క్రిమినల్ చర్యలు, ముక్కుపిండి వసూళ్లు చేస్తామన్నారు.
అసలు ధాన్యం కొనడానికి ఒక్క రూపాయి ఇవ్వని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మీ తిరుతో కొనుగోల్లు నిలిచిపోయి తడిసిన ధాన్యంపై బాధ్యత తీసుకుంటారా అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కొనుగోల్లు ఇప్పుడే మొదలైతే ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పుడే ఎలా మొదలుపెడతారో చెప్పాలన్నారు. జూలైలో వెరిఫికేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైతుల పక్షాన మాట్లాడాలని సూచించారు.
Fever Survey in AP: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం 45వ విడత ఇంటంటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఆశా వర్కర్‌తో పాటు గ్రామ,వార్డు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి జ్వరం లక్షణాలున్న వారు ఉన్నారా లేదా అనేది గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు.
KTR Sircilla Tour: దళిత బంధు పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు నిర్మించుకోనున్న రా రైస్ మిల్లు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Rahul Gandhi OU Visit: ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు మరో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి కాంగ్రెస్ ఎంపీకి అనుమతి ఇవ్వాలని పిటీషనర్స్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కే నిర్ణయాన్ని వదిలేసిన హైకోర్టు సింగిల్ బెంచ్. హైకోర్టు సింగిల్ బెంచ్ అదేశం ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకున్నా అనుమతి నిరాకరణ. తమ దరఖాస్తును ఓయూ వీసీ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ తాజా పిటిషన్‌లో కోరారు.
మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా ఐస్‌లాండ్ ప్రధాని కత్రిన్ జాకోబ్స్ డోటిర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎనర్జీ, మత్స్య సంబంధ అంశాలతో పాటు ఇతర వాణిజ్య విషయాలపై చర్చించారు.
Couple Murder Case: అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. వివాహిత భర్తనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా వివాహితతో పాటు ఆమె ప్రియుడిని నిందితుడు శ్రీనివాస్ హత్య చేశాడు.
నటి నవనీత్ కౌర్ రాణా దంపతులకు బెయిల్ మంజూరైంది. రాజద్రోహం కేసులో 10 రోజుల కిందట మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పడంతో ముంబై పోలీసులు ఈ దంపతులను అదుపులోకి తీసుకోగా, కోర్టు వీరిని కస్టడీకి అనుమతించింది.
తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీ హీరోయిన్ త్రిష, మంచులక్ష్మీ, సినీ హీరో విశ్వనాధ్, జబర్దస్త్ మహేష్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..
AP 10th Exams: పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఉరుములు, మెరుపులతో గాలి వాన భీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీళ్లు నిలవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని రామాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎక్సైజ్ కార్యాలయంలో, కోర్టు రహదారిపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఒక్కసారిగా చీకటిగా మారిన గురజాల ప్రాంతం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగ్జామ్స్ హాల్స్ మొత్తం చీకటిగా ఉండటంతో కొన్ని పరీక్ష కేంద్రాల్లో క్యాండిల్స్ పెట్టి ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.
Background
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివాహ వేడుక సహా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారం, దళితులు నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు శంకుస్థాపన, ఓ సర్పంచ్ సోదరుడి వివాహానికి హాజరు కావడంతో పాటు పలు ఈవెంట్లలో మంత్రి కేటీఆర్ నేడు పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు సిద్ధిపేటలోని రెడ్డి పంక్షన్ హాల్‌లో జరగనున్న అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాలరెడ్డి కుమారుడి వివాహానికి కేటీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరు కానున్నారు మంత్రి కేటీఆర్.
మధ్యాహ్నం 1 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకోనున్న రైస్ మిల్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మధ్యాహ్నం 1:30 గంటలకు సాయిమణికంఠ గార్డెన్‌లో జరగనున్న రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుని వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు..
దక్షిణ అండమాన్ సముద్రంలో అలజడి తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్, అంబర్ పేట, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, గుడిమల్కాపూర్, నాచారం, గోషామహల్, బాలానగర్, కాచిగూడ , గన్‌ఫౌండ్రీ, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కాప్రా ప్రాంతాల్లో బుధవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది.
భారీ వర్షం కారణంగా పవర్ కట్..
భారీ వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అమీర్ పేట, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పవర్ కట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోగా, హైదరాబాద్‌లోని మరికొన్ని ఏరియాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెట్లు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మైత్రీవనం స్టేట్‌హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
భారీ ట్రాఫిక్..
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు చికురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్ వద్ద రోడ్డు మీద ఉన్న గుంతలో కారు ఇరుక్కుపోయింది. అదే ఏరియాలో ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 4th May 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.119.22 కాగా, 13 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.23 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, డీజిల్ ధర రూ.105.64 అయింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.17 కాగా, డీజిల్‌పై 35 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.04కి అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ (Petrol Price in Vijayawada 4th May 2022) లీటర్ ధర రూ.121.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.106.69 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 26 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ పై 59 పైసలు తగ్గడంతో లీటర్ రూ.121.48 కాగా, డీజిల్‌పై 55 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.02 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -