Bengaluru pub offer leads to traffic jam: బెంగళూరు హెబ్బల్‌లోని ప్రముఖ పబ్‌లో ఏమి ఆర్డర్ ఇచ్చినా రూ.30 మాత్రమే అనే ఆఫర్ ప్రకటిచింది. ఈ ఆఫర్ ట్రాఫిక్ జామ్‌కు కారణం అయింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రమోట్ చేసిన ఈ ఆఫర్‌కు 300 మంది సామర్థ్యం ఉన్న పబ్ వద్ద 1,000 మందికి పైగా వచ్చారు. దీంతో 4 గంటలకు ముందే పబ్ మేనేజ్‌మెంట్ మూసివేసింది. ఈ ఘటనతో ఎస్టీమ్ మాల్ రోడ్, హెబ్బల్ ఫ్లైఓవర్ మీద పీక్ అవరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పబ్ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా 30 రూపాయల ఆఫర్‌ను సోషల్ మీడియాలో భారీగా ప్రమోట్ చేసింది. ఆఫర్ టైమింగ్‌లు స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల జనం మధ్యాహ్నం నుంచే రావడం ప్రారంభఇంచారు. పబ్ సీటింగ్ కెపాసిటీ కేవలం 300 మంది మాత్రమే కానీ, 1,000 మందికి పైగా వచ్చిన జనం వచ్చారు. క్యూలలో ఎదురు చూశారు. మొదటి బ్యాచ్‌ను మధ్యాహ్నం 12:30కి మాత్రమే లోపలికి అనుమతించారు. 1 గంటకు ఆఫర్ ముగిసింది అని ప్రకటించినా, కొత్తగా వచ్చిన జనం వెనక్కి తగ్గలేదు. పబ్ వద్ద ఏర్పడిన రద్దీ వల్ల కెంపపురా మెయిన్ రోడ్, ఎస్టీమ్ మాల్ రోడ్, హెబ్బల్ ఫ్లైఓవర్ మీద పీక్ అవరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. వాహనాలు రోడ్డు మీదే ఆగిపోయి, ట్రాఫిక్ పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఆఫర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని పబ్ యజమానులుచెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు పబ్ మీద తీవ్ర విమర్శలు తెచ్చాయి. పోలీసులు ఇకపై ఇలాంటి ఆఫర్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.అయితనా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారంటే.. ఇలా గంటల తరబడి క్యూలో నిలుచునే మనస్థత్వం ఏమిటన్నవిమర్శలు వస్తున్నాయి.