BJP Leader Annamalai : తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ 6 కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు. అంతేకాదు డీఎంకే సర్కారును దించేవరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలోని ఆరు మురుగన్ గుడులను దర్శించుకుంటానని.. 48 గంటల పాటు ఉపవాస దీక్ష పాటిస్తానని చెప్పారు. ఈ ఘటనపై డీఎంకే సర్కారే బాధ్యత వహించాలని బీజేపీ నాయకుడు అన్నారు.






అసలేమైందంటే..


డిసెంబర్ 25వ తేదీ రోజు చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిపైనా దాడి చేశారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఫోన్‌లో వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నేతలంతా ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణం అంటూ ఆరోపణలకు దారి తీసింది.


అప్పటివరకు చెప్పులు వేసుకోను..


ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకుడు అన్నామలై ఇటీవలే ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిందించారు. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్‌ఐఆర్‌ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. బాధితురాలి వ్యక్తిగత గోపత్యకు భంగం వాటిల్లేలా.. ఎఫ్ఐఆర్ లీక్ చేయడం వెనుక ప్రభుత్వం హస్తం ఉందని ఉన్నారు. రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 


తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన అన్నామలై.. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఇవాళ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. డీఎంకేను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారం కోల్పోయి.. వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధించే వరకు తాను చెప్పులే వేసుకోనంటూ ప్రతిజ్ఞ చేశారు. అలాగే నిందితుడు జ్ఞానశేఖర్‌కు డీఎంకేతో సంబంధాలు ఉన్నాయని అందుకే అతడిపై ఇంకా రౌడీషీట్ తెరవలేదంటూ వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచకుండా పోటీ చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని చెడు అంతమైపోవాలని కోరుకుంటా ఆ మురుగన్‌ను దర్శించుకుంటానని చెప్పుకొచ్చారు.


Also Read : Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?