Andhra Pradesh and Telangana Heavy Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని అంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా వారం రోజుల పాటు వానలు పడితే, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం గమనం, తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Continues below advertisement


గంట గంటకు మారుతున్న వాతావరణం 


ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగతున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారి, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ వ్యవస్థ బుధవారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడే ఛాన్స్ ఉంది. ఈ అనూహ్య మార్పులతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో వర్షాల తీవ్రత రోజురోజుకూ పెరగొచ్చని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మత్స్యకారులు బువారం నుంచి మూడురోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.   


ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల ముప్పు- జిల్లాల వారీగా వివరాలు 


ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండబోతోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత పెరిగేకొద్దీ, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యే ప్రమాదం ఉంది.    


మంగళవారం వర్షాలు కురిసిన ప్రాంతాలు:- పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా,గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 
బుధవారం వర్షాలు కురిసే ప్రాంతాలు: బుధవారం అల్పపీడనం తీవ్రత పెరుగుతుంది. బాపట్ల, ప్రకాశం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అనాకపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సైతం మోస్తు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.   


గురువారం వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు: గురువారం నాటికి వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నందున, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు,  అత్యంత జాగ్రత్తగా ఉండాలి. 


తెలంగాణపై ఐదు రోజుల పాటు వర్షాల ప్రభావం 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


మంగళవారం వర్షాలు కురిసే ప్రాంతాలు: తెలంగాణలోని 22 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మాల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ,మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు పడ్డాయి.  


బుధవారం వర్షాలు కురిసే ప్రాంతాలు: బుధవారం కూడా దాదాపు పైన పేర్కొన్న జిల్లాల్లో  వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ్ వర్షాలు భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నాయి. 


గురువారం వర్షాలు పడే ప్రాంతాలు: గురువారం నాటికి వర్షాల తీవ్రత పెరుగుతుంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్,వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణేట జోగులాంబ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 


గురు, శుక్రవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిన ప్రాంతాలు: తెలంగాణలోని వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, గురువారం, శుక్రవారం రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 


ఈ తీవ్రత దృష్ట్యా కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.