Breaking News Live Telugu Updates: చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
Background

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణతోపాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ అంటే సోమవారం, అక్టోబర్ 8, 2023న ప్రకటించనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.
ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. వచ్చే జనరల్ ఎన్నికలకు దీన్ని సమీఫైనల్‌గా చూస్తున్నారంతా.
- - - - - - - - - Advertisement - - - - - - - - -