Breaking News Live Telugu Updates: ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టిన టీమిండియా ఆటగాళ్లు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 07 Oct 2023 01:42 PM
156 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌

వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్‌ 156 పరగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచిన బంగ్లా.. అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్గాన్‌ జట్టుకు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్భాజ్‌, ఇబ్రహీం జర్దాన్‌ శుభారంభం ఇచ్చారు. బంగ్లా పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ  జోడి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 62 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ శతకం వైపు దూసుకుపోతున్న గుర్భాజ్‌ను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేసి అఫ్గాన్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు.

Background

ఆసియా క్రీడల్లో భారత్ సెంచరీ కొట్టింది. పతకాల బోర్డులో నాల్గో స్థానంలో ఉన్న భారత్‌ మొత్తం వంద పతకాలు సాధించింది. ఇందులో గోల్డ్‌ 25, సిల్వర్ 35, బ్రాంజ్‌ 40 మెడల్స్ కైవశం చేసుకుంది.


భారత స్టార్, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించి సత్తా చాటింది. ముచ్చటగా మూడో స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకను చైనా గగనతలంపై రెపరెపలాడించింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన జ్యోతిసురేఖ... ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలోనూ పసిడి పతకం అందుకుంది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 149-145తో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ అద్భుత ఆటతీరుతో గెలుపొందింది. ప్రారంభంలో కాస్త తడబడ్డ ఈ భారత స్టార్‌ ఆర్చర్‌.. తర్వాత తన అనుభవాన్నంత ఉపయోగించి అద్భుతంగా పుంజుకుంది. 


మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రారంభంలో 8 పాయింటర్‌ ప్రారంభించిన సురేఖ.. తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రెండు రౌంట్లలో జ్యోతి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తర్వాత 149-145తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
 అంతకుముందు ఆర్చరీలో భారత్‌కు మరో కాంస్య పతకం కూడా దక్కింది. అదితి గోపీచంద్ స్వామి 146-140తో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ జిలిజాటిని ఓడించి కాంస్య పతకాన్ని సాధించి ఆసియా గేమ్స్‌ చివరి రోజు భారత్‌కు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చింది. అదితి 17 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా అదితి బంగారు పతకం సాధించింది. 










 ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్‌లో ఆల్-ఇండియా పురుషుల వ్యక్తిగత ఫైనల్‌లో ఓజాస్ ప్రవీణ్-అభిషేక్ వర్మ ఒకరితో ఒకరు తలపడనుండగా, మహిళల కబడ్డీ జట్టు ఫైనల్‌లో చైనీస్ తైపీతో తలపడుతోంది. మరికొన్ని నిమిషాల్లో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 100 దాటనుంది. 


శుక్రవారం జరిగిన  ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో చైనీస్‌ తైపీని ఓడించి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందం పసిడి గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ జంట 159–158తో సో చేవన్‌–జేహూన్‌ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. సురేఖ–ఓజస్‌ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్‌ జోడీపై, క్వార్టర్‌ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది.


ఆసియా క్రీడల్లో భారత్ హాకీ జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన 19 ఏషియన్ గేమ్స్ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను భారత్ చిత్తు చేసింది. 5-1  గోల్స్ తేడాతో భారత్ ఏషియా గేమ్స్ లో మరోసారి చాంపియన్ గా నిలిచింది. తొమ్మిదేళ్ల తరువాత భారత హాకీ టీమ్ గోల్డ్ నెగ్గింది. 


హాకీ జట్టుకు క్యాష్ రివార్డ్..
హాకీ నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా రికార్డు ప్రకటించింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రూ.5 లక్షల క్యాష్ రివార్డు ఇవ్వనున్నామని తెలిపింది. వీరితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నకు సైతం ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల క్యాష్ రివార్డు ప్రకటించారు.


ఈ టోర్నీలో అత్యధికంగా 13 గోల్స్‌తో దుమ్మురేపిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌.. ఫైనల్లోనూ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించాడు. అమిత్‌ రొహిదాస్‌ (36వ నిమిషంలో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో), అభిషేక్‌ (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా.. ప్రత్యర్థి జపాన్‌ తరఫున సరెన్‌ టనాక (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేయడంతో భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.