Breaking News Live Telugu Updates: మరో వినూత్న కార్యక్రమంతో టీడీపీ నిరసన- కాంతితో క్రాంతి పేరుతో రేపు ఆందోళన

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 06 Oct 2023 09:23 AM
ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత్ క్రికెట్ జట్టు

ఆసియా క్రీడల్లో భారత్ క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునాయాసమైన విజయం సాధించి ఫైనల్‌ బెర్త్ ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలోనే ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో ఒక్క వికెట్‌ కోల్పోయింది. తిలక్‌ వర్మ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గైక్వాడ్‌ 40 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేసింది. 

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు

హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. పూజకృష్ణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయనతోపాటు డైరెక్టర్‌లుగా ఉన్న పూజ లక్ష్మీ, నాగేశ్వరి ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేటలో ఎల్లారెడ్డి గూడాల ఈ తనిఖీలు చేస్తున్నారు. 

వరల్డ్ కప్‌లో టీమిండియాకు షాక్‌- స్టార్ట్ బ్యాట్స్‌మెన్‌కు డెంగీ

ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. ఇందులో భారత్ తొలి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనుంది. అంతకంటే ముందే భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ కు శుభ్ మన్ దూరం కావచ్చని సమాచారం. అయితే ప్రస్తుతానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.


చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ఎంఏ చిదంబరం స్టేడియంలో టీమ్ఇండియా ప్రాక్టీస్ చేస్తోంది. కానీ శుభ్మన్ మాత్రం ప్రాక్టీస్ చేయలేదు. ఆయనకు డెంగీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం యాజమాన్యం, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. శుక్రవారం ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. శుభ్మన్ కోలుకుంటే ఆడే అవకాశం ఉంది. ఒకవేళ కోలుకోకపోతే ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కు దూరమవుతాడు.

నేడు సీఎం బ్రేక్ ఫాస్ట్‌ పథకం ప్రారంభం- హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం దసరా కానుక ఇచ్చింది. రోజూ ఉదయం పూట అల్పాహారం పెట్టే కొత్త పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రోస్ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని కాసేపట్లో మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు. 

Background

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజులుగా హస్తినలో ఉన్న ఆయన.. గురువారం రాత్రి విజయవాడకు తిరిగొచ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు లోకేష్ చేరుకున్నారు. లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలతో కరచాలనం, అభివాదం చేసిన లోకేష్.. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. 


ఈ ఉదయం రాజమండ్రికి నారా లోకేష్ చేరుకోనున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించి బాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి బాబుతో లోకేష్ మాట్లాడే అవకాశముంది. హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు, కస్టడీపై శుక్రవారానికి విచారణ వాయిదా పడింది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబుకు వివరించనున్నారు. కేసుల్లో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలతో పాటు టీడీపీ-జనసేన పొత్తు పరిణామాల గురించి చంద్రబాబుతో చర్చించనున్నారు.


చంద్రబాబు అరెస్ట్ తర్వాత రెండుసార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లోకేష్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు, అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు  గత నెల 14న లోకేష్ ఢిల్లీకి బయల్దేరారు. ఆ తర్వాత ఇవాళ విజయవాడకు చేరుకోగా.. రేపు మరోసారి జైల్లో బాబును కలవనున్నారు. లోకేష్‌తో పాటు కుటుంబసభ్యులు కూడా చంద్రబాబును కలవనున్నారు. బాబుతో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశముంది. రేపు రాజమండ్రికి లోకేష్ వస్తుండటంతో భారీగా శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. 


యుఎస్ బాండ్ ఈల్డ్స్‌ మెత్తబడడం, ముడి చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి తగ్గడంతో ప్రపంచ సూచీలలో స్థిరత్వం కనిపించింది. వరుస పతనం తర్వాత ఇండియన్‌ మార్కెట్లు రికవరీని చూశాయి. ఈ రోజు ప్రకటించబోయే ఆర్‌బీఐ పాలసీ ఫలితాలను మార్కెట్‌ నిశితంగా గమనిస్తుంది.


US స్టాక్స్ డౌన్
ఈ రోజు విడుదలయ్యే నెలవారీ ఉద్యోగాల నివేదిక, వడ్డీ రేట్ల ఔట్‌లుక్‌పై స్పష్టమైన సంకేతాల కోసం పెట్టుబడిదార్లు ఎదురుచూస్తుండండతో US స్టాక్స్‌ గురువారం కనిష్ట స్థాయుల నుంచి బౌన్స్ బ్యాక్‌ అయ్యాయి, ఆ తర్వాత కొద్ది పడిపోయాయి.


పెరిగిన ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్‌ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఆసియాలో షేర్లు పెరిగాయి, వరుస నష్టాల తర్వాత మార్కెట్లకు కొంత ఉపశమనం లభించింది. ట్రేడర్ల దృష్టి ఈ రోజు విడుదలయ్యే US జాబ్‌ డేటాపై ఉంటుంది.


ఇవాళ ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 5.5 పాయింట్లు లేదా 0.03 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,610 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.









ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


బజాజ్ ఫైనాన్స్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ & కన్వర్టబుల్ వారెంట్ల ద్వారా రూ. 10,000 కోట్ల వరకు సమీకరించడానికి బజాజ్ ఫైనాన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.


అదానీ విల్మార్: ప్యాక్ చేసిన ఆహారాల్లో భారీ అవకాశాలను అందుకుని అమలు చేయడంతో, 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో అదానీ విల్మార్ 11% (YoY) రెండంకెల వాల్యూమ్ వృద్ధిని రిపోర్ట్‌ చేసింది.


వాలియంట్ ల్యాబ్స్: వాలియంట్ ల్యాబ్స్ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ అవుతాయి. ఈ స్టాక్ 15-16% ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా.


టాటా మోటార్స్: FY24 రెండో త్రైమాసికంలో దాదాపు 300 మిలియన్‌ పౌండ్ల పాజిటివ్‌ ఫ్రీ క్యాష్‌ ఫ్లోను ఆశిస్తున్నట్లు టాటా మోటార్స్ ఆర్మ్ JLR తెలిపింది. Q2లో, సరఫరాల్లో మెరుగుదల కారణంగా అమ్మకాల్లో పెరుగుదలను ఈ కంపెనీ నివేదించింది. ఖాతాదార్లకు మరిన్ని వాహనాలను అందించడానికి ఇప్పుడు JLRకు అవకాశం దక్కింది.


స్టేట్‌ బ్యాంక్‌: కేంద్ర ప్రభుత్వం SBI చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలాన్ని ఆగస్టు 2024 వరకు పొడిగించింది.


గోద్రెజ్ కన్జ్యూమర్‌: Q2 FY24లో బలహీనమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితులను చూశామని గోద్రెజ్ కన్స్యూమర్ ప్రకటించింది. అయినప్పటికీ, వ్యాపారంలో మిడిల్‌-సింగిల్-డిజిట్ వాల్యూమ్ వృద్ధితో స్థిరమైన పనితీరును కనబరిచింది.


లుపిన్: టోల్వాప్టాన్ టాబ్లెట్‌ల కోసం లూపిన్‌ పెట్టుకున్న న్యూ డ్రగ్ అప్లికేషన్‌కు US FDA నుంచి తాత్కాలిక ఆమోదం లభించింది.


ఇండిగో: పెరుగుతున్న ATF ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఇంధన ఛార్జీలను ఇండిగో ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన ఛార్జీలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయి.


PB ఫిన్‌టెక్: సాఫ్ట్‌బ్యాంక్ ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా PB ఫిన్‌టెక్‌లో కొంత వాటాను విక్రయించే అవకాశం ఉంది.


సన్ ఫార్మా: EzeRxలో 37.76% ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌ను కొనుగోలు చేయడానికి సన్ ఫార్మా ఒప్పందం చేసుకుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.