Breaking News Live Telugu Updates: హీరో విశాల్ ఫిర్యాదుపై సీబీఐ కేసు
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
ABP Desam Last Updated: 05 Oct 2023 01:42 PM
Background
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,...More
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. రాత్రికి 1 జన్‌పథ్ నివాసంలో బస చేయనున్నారు. 6న ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్ నివాసం నుంచి విజ్ఞాన్ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే రానుండటంతో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తిరేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికిపుడు అసెంబ్లీ రద్దు చేస్తే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీకి ప్రజల్లో సానుభూతికి పెరుగుతోంది. 25 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. అప్పుల కోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు జగన్. హైదరాబాద్‌లో ఐటీ సోదాలు రాజధాని నగరం హైదరాబాద్ లో మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ తో పాటు నగర శివార్లలోని ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో పాటు కూకట్‌పల్లిలోని గోపినాథ్ సోదరుల నివాసాల్లోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు ప్రసాద్, రఘువీర్, కోటేశ్వరరావు నివాసాలతో పాటు వారి కంపెనీల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ హైదరాబాద్ భారీ స్థాయిలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇఫ్పుడు ఇంత భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత జూన్ నెలలో హైదరాబాద్ లో ఐటీ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. 40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయట పెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఆనాడు గుర్తించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హీరో విశాల్ ఫిర్యాదుపై సీబీఐ కేసు
మార్క్ ఆంటోనీ మూవీకి సంబంధించి సెన్సార్ బోర్డు లంచంగా 6.5 లక్షలు తీసుకున్నట్టు వచ్చిన వివాదంపై కేంద్రం సీరియస్‌గా రియాక్ట్ అయింది. హీరో విశాల్ చేసిన ఆరోపణలపై ఏకంగా సీబీఐని రంగంలోకి దింపింది. మార్క్ ఆంటోని సినిమా హిందీ సెన్సార్ కోసం సీబీఎఫ్‌సీ 6.5 లక్షల డిమాండ్ చేసిందని విశాల్ ఆరోపించాడు. సెన్సార్ బోర్డు అవినీతిమైపోయిందని విమర్శలు చేశారు. దీంతో అత్యవసరంగా సమావేశమైన ప్రసార సమాచార శాఖ అత్యవసరంగా భేటీ అయింది.