Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో కూతురిపై తండ్రి అత్యాచారం- ఇంటి నుంచి బయటపడితే అక్కడే అదే పరిస్థితి

Latest Telugu News In Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 05 Jan 2024 12:15 PM
Jayashankar Bhupalapalli News: తల్లిన చంపిన కుమారుడు- జయశంకర్‌ భూపాలపల్లిలో దారుణం

జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లాలో దారుణం జరిగింది. రేగొండ (Regonda) మండలం తిరుమలగిరి(Tirumalagiri) గ్రామంలో తల్లిని చంపిన కుమారుడు చంపేశాడు. తిరుమలగిరి చెందిన కంచరకుంట్ల రాజీ రెడ్డి గొడ్డలితో  అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. అదే టైంలో తల్లిపై దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి చెందిన ఊకంటి జ్యోతి అనే మహిళ పై కూడా అటాక్ చేశాడు. ఆమె ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉంది. ఆమెను వెంటనే ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత నిందితుడు కంచరకుంట్ల రాజిరెడ్డి పారిపోయాడు. గ్రామస్తులు అతన్ని వెతికి గోరుకొత్తపల్లి మండలం చిన్నకొడపాక గ్రామంలో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు 

Background

Andhra Pradesh Latest News And Telangana Latest News : 


 విజయవాడ(Vijayawada) టీడీపీ(TDP)లో మరోసారి కలకలం రేగింది. విజయవాడ ఎంపీ(Vijayawada MP) స్థానం వేరే వాళ్లకు ఇస్తున్నట్టు తెలుగుదేశం క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి తెలియజేసింది. అందుకే అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని నాని సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలియజేశారు. 


నాని స్టైల్‌ వేరు 


తెలుగుదేశంలో రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. ముక్కుసూటిగా మాట్లాడే నాని తరచూ వివాదాల్లోకి వస్తుంటారు. ఆయన దూకుడుతో తరచూ టీడీపీని ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టేస్తుంటారు. అప్పుడప్పుడూ పార్టీ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలుగుతూ కూడా వార్తల్లో హాట్‌టాపిక్ అవుతూ ఉంటారు. ఆయన మీడియా ముందుకు వస్తే చాలా ఏదో బ్రేకింగ్ ఉండనే ఉంటుంది. అలా వివాదాస్పదుడిగా పేరున్న విజయవాడ ఎంపీని సైలెంట్ అవ్వాలని పార్టీ అధినాయకత్వం సూచించిందని చెప్పుకుంటున్నారు. 


సైలెంట్‌గా ఉండాలని సూచన 









 


జనవరి ఏడో(January 7th) తేదీని తిరువూరు(Tiruvuru)లో టీడీపీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు విస్తృతంగా చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే కేశినేని నాని కూడా మీడియాతో మాట్లాడుతూ.... అసలు ఇంత వరకు ఎప్పుడూ జరగని విధంగా చంద్రబాబు సభను నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే అందరితో మాట్లాడుతున్నామని అన్నారు. అయితే ఇంతలో ఆయన్ని సైలెంట్‌గా ఉండాలంటూ పార్టీ ఆదేశించడం కలకలం రేపుతోంది. 


సీనియర్ల మంతనాలు 


విజయవాడ ఎంపీ టికెట్‌ వేరే వ్యక్తికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు కేశినేని నాని సోషల్ మీడియాలో వివరించారు. పార్టీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెంరఘు, కొనకళ్ల నారాయణ నానితో సమావేశమై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. తిరువూరులో జరిగే సభకు వేరే వ్యక్తిని ఇంఛార్జ్‌గా నియమించారని వివరించారు. అందుకే ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈసారి విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారని కూడా చెప్పేశారు. అందుకే పార్టీ విషయాల్లో కూడా ఎక్కువ జోక్యం వద్దని సూచించారు. 


పార్టీ నేతల మాటలు సూచనలు విన్న కేశినేని నాని ఓకే అంటూ చెప్పారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అనుచరులకు తెలియజేశారు. పార్టీ, అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని అన్నారు. 


సోషల్ మీడియాలో పోస్టు 


ఆయన ఏమన్నారంటే... అందరికీ నమస్కారం.. నిన్న(గురువారం) సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అందుకే ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్టు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు వివరించారు. అధినేత ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని హామీ ఇచ్చాను అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.