Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 04 Oct 2023 12:17 PM

Background

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో ఉన్న  నారా లోకేష్ ను అరెస్ట్ చేసి తీసుకు వచ్చేందుకు టీమ్ కూడా...More

పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

పెడన సభలో అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాంటి సమాచారం మీ వద్ద ఉంటే సాక్ష్యాలు సమర్పించాలని ఆయనకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదని అలా రాని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు.