Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రెస్‌మీట్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 27 May 2023 01:28 PM
Breaking News : హైదరాబాద్ చేరుకున్న ఆప్‌ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. ఇప్పటికే మమత, నితీష్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపబోతున్నారు. 


ఢిల్లీలో సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి సీఎంను కలవనున్నారు.

గండిపేట యూనియన్ బ్యాంక్ పైఅంతస్తులో అగ్ని ప్రమాదం- ఎగసిపడుతున్న మంటలు

రంగారెడ్డి జిల్లా గండిపేట యూనియన్ బ్యాంక్ పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. పై అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో  ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. యూనియన్ బ్యాంక్‌కు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడుతున్నారు  నార్సింగీ పోలీసులు. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

జగ్గయ్యపేటలోని ఫార్మా కంపెనీలో విషవాయులు లీక్- ముగ్గురికి అస్వస్థత 

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఓ ఫార్మా కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటోనగర్‌లోనీ శ్రీనివాస కెమికల్ ఫార్మాలో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈదుర్ఘటనలో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గగురయ్యారు. వారిని మొదట జగ్గయ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం విజయవాడ తరలించారు. 

నాపరాళ్ల కింద నలిగిన జీవితాలు- రేపల్లెలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లా రేపల్లెమండలం పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలో నాపరాయి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నాపరాయితో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాలలైన ముగ్గుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరికి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుతం చికిత్సస అందిస్తున్నారు. మాచర్ల నుంచి నాపరాయి లోడుతో ఈ లారీ రేపల్లె వెళ్తున్నట్లు సమాచారం.


 

Background

Breaking News Live Telugu Updates: బాపట్ల జిల్లా రేపల్లెమండలం పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలో నాపరాయి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నాపరాయితో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాలలైన ముగ్గుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరికి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుతం చికిత్సస అందిస్తున్నారు. మాచర్ల నుంచి నాపరాయి లోడుతో ఈ లారీ రేపల్లె వెళ్తున్నట్లు సమాచారం.


నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై వాదనలు


వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించిన తర్వాత..  సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో ఈ ఉదయానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 


అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఏమని వాదించారంటే ? 


ఫోన్ కాల్స్ ఆధారంగా  అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వివేకానందరెడ్డిది హత్యో, గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో, డాక్టరో కాదన్నారు.  2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్‌ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్‌ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్‌ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్‌ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్‌ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని లాయర్‌ పేర్కొన్నారు.









వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు. దాదాపుగా గంట సేపు సునతారెడ్డి తరపు లాయర్.. న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు. 


నేడు సీబీఐ తరపు వాదనలు


సీబీఐ లాయర్ వాదనలు ఇవాళ(శనివారం) వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను న్యాయమూర్తి ముందు సీబీఐ అధికారులు ఉంచారు. మరో వైపు అవినాష్ రెడ్డి  హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. కర్నూలు నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అక్కడ్నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంట అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జైల్లో ఉన్న  అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి  బీపీ పెరగడంతో.. నిమ్స్ లో చికిత్స చేయించి మళ్లీ జైలుకు తరలించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.