Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా ఎంపిక చేసే జాబితాను తమిళిసై తిరస్కిరించారు. ఈ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ వద్దకు ప్రభుత్వ లిస్ట్ పంపించింది. దాన్ని ఇన్ని రోజులు ఆమోదించకుండా ఉంచిన గవర్నర్ ఇవాళ తిరస్కరిస్తూ సమాచారం పంపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి నాల్గో విడత యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించనున్నారు. ఈసారి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. ఈ మేరకు జనసేన రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది.
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో వద్దని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెరువుల్లోనే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకూ సూచనలు చేసింది. అనంతరం నిమజ్జనంపై సమగ్రనివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకీ ఇవ్వాలని సిఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు వినాలని సీఐడీ విజప్తి చేసింది. అయితే బెయిల్ పిటిషన్‌పై ముందు వాదనలు వినాలని చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టును విజప్తి చేశారు. మెమో ఫైల్ చేయాలని సీఐడీకి జడ్జి ఆదేశించారు.
కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి దర్శనం కల్పించారు. దర్శనానంతరం స్వామివారి వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ అన్నవరం దేవస్థానానికి చేరుకుని భువనేశ్వరికి తమ సంఘీభావం తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. ఈ ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్దార్థ లుథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు సీజేఐ. వివరాలు చెప్పిన తర్వాత రేపు మరోసారి మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ చూసించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల సెలవుల అనంతరమ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ నిర్ణయించింది. అందుకే ఇవాల్టి నుంచి సమావేశాలు సజావుగా జరగనున్నాయి.
ఆసియా క్రీడల్లో ఇండియా గోల్డ్ పతకాల వేట ప్రారంభించింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ బృందం తొలి గోల్డ్ సాధించింది. మొదటి రోజు భారత్ ఐదు పతకాలు సాధించిన అందులో గోల్డ్ మాత్రం లేదు. రోయింగ్‌లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్, షూటింగ్‌లో ఓ బ్రాంజ్ వచ్చింది.
Background
Breaking News Live Telugu Updates: ఆసియా క్రీడల్లో ఇండియా గోల్డ్ పతకాల వేట ప్రారంభించింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ బృందం తొలి గోల్డ్ సాధించింది. మొదటి రోజు భారత్ ఐదు పతకాలు సాధించిన అందులో గోల్డ్ మాత్రం లేదు. రోయింగ్‌లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్, షూటింగ్‌లో ఓ బ్రాంజ్ వచ్చింది.
గిల్ రికార్డులు
టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది చాలా పరుగులు చేస్తున్నాడు. దీంతోపాటు ఎన్నో భారీ రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి శుభ్‌మన్ గిల్ ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు వచ్చాయి. వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు ఇది ఆరో సెంచరీ. ఆస్ట్రేలియాపై తొలిసారిగా సెంచరీ సాధించాడు. వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో 35 ఇన్నింగ్స్‌ల్లో 1,900 పరుగులు చేసిన ప్రపంచ తొలి బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ రికార్డు జాబితాలో అతను దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌లను దాటాడు.
వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు
శుభ్‌మన్ గిల్- 1917 పరుగులు
హషీమ్ ఆమ్లా- 1844 పరుగులు
బాబర్ ఆజం- 1758 పరుగులు
రాస్సీ వాన్ డెర్ డస్సెన్- 1679 పరుగులు
ఫఖర్ జమాన్- 1642 పరుగులు
ఈ ఏడాది శుభ్‌మన్ గిల్‌కి ఇది ఐదో సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించారు. కోహ్లి నాలుగుసార్లు, రోహిత్ మూడుసార్లు ఈ ఘనత సాధించారు. సచిన్ టెండూల్కర్ కూడా రెండుసార్లు దీన్ని సాధించాడు.
భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు కొట్టారు
ఇండోర్ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భారత్ తన వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ కొట్టిన గరిష్ట సిక్సర్ల సంఖ్య 19. వన్డేల్లో మూడు వేల సిక్సర్లు బాదిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
వన్డే ఇన్నింగ్స్‌లో భారత్ అత్యధిక సిక్సర్లు బాదిన సందర్భాలు ఇవే
19 సిక్సర్లు- వర్సెస్ ఆస్ట్రేలియా, బెంగళూరు, 2013
19 సిక్సర్లు- వర్సెస్ న్యూజిలాండ్, ఇండోర్, 2023
18 సిక్సర్లు- వర్సెస్ బెర్ముడా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2007
18 సిక్సర్లు- వర్సెస్ న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2009
18 సిక్సర్లు- వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండోర్, 2023.
ఆస్ట్రేలియాపై నాలుగో అత్యధిక స్కోరు
ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలిచింది. 2018లో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు (481/6) చేసింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -