Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 23 Sep 2023 12:23 PM
సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సీఐడీ విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీఐడీ విచారణ కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. 

కరెంట్ షాక్ కొట్టి కాకినాడలో ముగ్గురు రైతులు మృతి

కాకినాడ - ఉప్పలపాడు నుంచి రాజపూడి వెళ్లే దారిలో ప్రమాదం. పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు.

Background

Breaking News Live Telugu Updates: ‘ఈ రోజు ద్రోణి జార్ఖండ్ & పరిసరాల్లో ఉన్న అల్పపీడన ప్రదేశం నుంచి ఛత్తీస్ గడ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు, ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని (ఉత్తర, తూర్పు) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 93 శాతంగా నమోదైంది.









ఈరోజు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగముతో వీయవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.


‘‘బలహీనమైన రుతుపవనాల వలన నేడు సాయంకాలం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం అవి అన్నమయ్య జిల్లాలోని కోడూరు - తిరుపతి జిల్లా గూడూరు మీదుగా బలపడుతూ విస్తరిస్తున్నాయి. మరో రెండు గంటల వరకు ఈ వర్షాలు భారీగా కొనసాగనున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే బలహీనమైన రుతుపవనాలల్లో గాలులు బలహీనంగా ఉంటుంది, కాబట్టి వర్షాలు ఎక్కువసేపు పడతాయి. గాలులు అంటే మేఘాలు కదిలే ఎత్తులో ఉన్న గాలులు అని అర్థం’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు:


తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.25 ---- నిన్నటి ధర ₹ 109.14 
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.31 ---- నిన్నటి ధర ₹ 109.14 
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.45 ---- నిన్నటి ధర ₹ 111.36 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.80 ---- నిన్నటి ధర ₹ 109.41 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.47---- నిన్నటి ధర ₹ 109.32 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.82 ---- నిన్నటి ధర ₹ 111.94 


తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) డీజిల్ ధరలోనూ మార్పు ఉండడం లేదు. లీటర్‌ డీజిల్‌ ₹ 97.82 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.43 ---- నిన్నటి ధర ₹ 97.32 
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.49 ---- నిన్నటి ధర ₹ 97.29 
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.48 ---- నిన్నటి ధర ₹ 99.40 
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 97.93 ---- నిన్నటి ధర ₹ 97.57 
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.63 ---- నిన్నటి ధర ₹ 97.50 
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.83 ---- నిన్నటి ధర ₹ 99.94 









 


ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.87 ---- నిన్నటి ధర ₹ 111.79 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.87 ---- నిన్నటి ధర ₹ 111.79 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.48 ---- నిన్నటి ధర ₹ 110.48 
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.16 ---- నిన్నటి ధర ₹ 111.98 
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.10 ---- నిన్నటి ధర ₹ 111.90 
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.16 ---- నిన్నటి ధర ₹ 111.04 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.81 ---- నిన్నటి ధర ₹ 111.17 


ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.61 ---- నిన్నటి ధర ₹ 99.52 
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.61 ---- నిన్నటి ధర ₹ 99.52 
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.27 ---- నిన్నటి ధర ₹ 98.27 
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.90 ---- నిన్నటి ధర ₹ 99.69
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.89 ---- నిన్నటి ధర ₹ 99.64 
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర 98.94 ---- నిన్నటి ధర ₹ 98.82 
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.53 ---- నిన్నటి ధర ₹ 98.96

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.