Breaking News Live Telugu Updates: దసరా నుంచి విశాఖలోనే పాలన- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి- మంత్రులకు స్పష్టం చేసిన జగన్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 20 Sep 2023 01:42 PM

Background

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో అమరావతిలో జరగనుంది.  వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.  ఈ...More

నా సీటు పోయినా ఫర్వాలేదు- మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావాలే: కేటీఆర్

మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటు పోయినా ఫర్వాలేదు కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు.