Breaking News Live Telugu Updates: అమిత్‌షా తెలంగాణ టూర్ రద్దు- బిపోర్ జాయ్ తుపాను నేపథ్యంలో నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
రెండు రోజులుగా బీజేపీపై విమర్శలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ వైఖరితో ఉన్న పార్టీ వైసీపీయే అన్నారు. జగన్‌తో ఎప్పుడు బీజేపీ ఉందో చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గుర్తుకు వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలను బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ఎప్పుడూ సమర్థించలేదని తెలిపారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు.
ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి ఏపీఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి. శోభా బిందు, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు సంబంధించి.. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను మే 24న విడుదల చేశారు. అదేవిధంగా మే 24 నుంచి 26 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు.
Background
Breaking News Live Telugu Updates: తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
శేఖర్‌కు హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు, ఆఫీస్‌ల, భువనగరిలో ఉన్న కార్యాలయాలు, నివాసాల్లో మొత్తం 12 చోట్ల సోదాలు చేపట్టారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో తనిఖీలు సాగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. 30 బృందాలు ఈ సోదాల్లో పాలుపంచుకుంటున్నాయి.
మరోవైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్స్‌పై కూడా ఐటీ గురి పెట్టింది. సోదాలు చేస్తోంది. కేపి.హెచ్.బి కాలనీలోని జేసీ బ్రదర్శ్‌తోపాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఐటీ వింగ్ సోదాలు జరుపుతోంది. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. జెసి బ్రదర్స్ కి సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డైరెక్టర్ గాా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలు పై ఆరా తీస్తున్నారు అధికారులు.
కాసేపట్లో వారాహి యాత్ర
నేటి(బుధవారం, జూన్ 14 ) నుంచి వారాహి ప్రజాక్షేత్రంలోకి రానుంది. అన్నవరం నుంచి జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. సత్యదేవుడి దర్శనం తర్వాత యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తున్నారు పవన్.
కాకినాడ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. అన్నవరంలో ప్రారంభమయ్యే యాత్ర కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యల అర్జీలు0 స్వీకరిస్తారు. అంటే ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో ఈ సందర్శన ఉంటుందని రూట్ మ్యాప్‌లో చెప్పారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగిన ప్రాంతాలకు భారీగా జనసైనికులు తరలి వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, యువత తరలివస్తున్నారని నాయకులు చెబుతున్నారు.
మొదటి విడతలో జూన్24 వరకు యాత్ర సాగనుంది. యాత్రంలో భగంగా ఇవాళ కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తివారితో పవన్ మాట్లడబోతున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -