Breaking News Live Telugu Updates: సింగరేణి ఎన్నికలు వాయిదా
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
ABP Desam Last Updated: 11 Oct 2023 12:44 PM
Background
మొదటి రోజు దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు తనను అడిగారని, ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో కొడితే వచ్చేవి ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం (అక్టోబరు 10)...More
మొదటి రోజు దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు తనను అడిగారని, ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో కొడితే వచ్చేవి ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం (అక్టోబరు 10) సీఐడీ విచారణ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవన్నీ తనని విచారణ అధికారులు అడిగారని అన్నారు. తన ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షమైనా, ప్రజలనైనా కక్ష సాధించడం అలవాటుగా మారిందని అన్నారు. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని, యువతకి ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని నిలదీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్రమ అరెస్టు చేసి చంద్రబాబుని జైలులో వేశారని అన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని అన్నారు. తాను యువగళం పాదయాత్ర ద్వారా అరాచక సర్కారుపై ప్రజల్ని చైతన్యపరుస్తుంటే.. ఇదిగో ఇలా తప్పుడు కేసులతో యువగళం ఆగిపోయేలా చేశారని మండిపడ్డారు.ఈ తప్పుడు కేసులన్నీ ప్రజల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడానికి తాను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమేనని అన్నారు. తాను లండన్‌లో ఉన్నప్పుడు తనకి తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందని జగన్ అంటున్నారని అన్నారు. ఏసీబీ - సీఐడీ సీఎం కింద పనిచేస్తాయనే కనీస అవగాహనలేని పిచ్చి జగన్ డీజీపీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెప్పానని, మళ్లీ రేపు రమ్మని 41a నోటీసు ఇచ్చారని, ఉదయం 10 గంటలకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు తానెందుకు భయపడాలని ప్రశ్నించారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదాపడింది. చంద్రబాబు తరఫున వా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అత్యవసర కేసులు విచారణ ఉన్నందున మధ్యాహ్నం రెండు తర్వాత ఆ కేసులను ధర్మాసనం టేకప్ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.మొదటగా హరీష్ సాల్వే వాదనలు సోమవారం కోర్టు సమయం పూర్తయ్యే వరకూ విచారణ జరిగింది. మంగళవారం ఉదయమే విచారణ ప్రారంభణైన వెంటనే.. హరీష్ సాల్వేను ఎంత సేపు వాదనలు వినిపిస్తారని ధర్మాసనం అడిగింది. గంటసేపు అని చెప్పారు. ఆ మేరకు వాదనలు వినిపించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని వాదించారు. వివిద హైకోర్టుల్లో వచ్ిచన తీర్పును ఉదహరించిన సాల్వే.. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదు. దాన్నే సవాల్ చేస్తున్నామని.. . అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. హైకోర్టులో విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని వాదించారు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని.. . కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని వాదించారు. నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపజేయకూడదన్నారు. చట్టసవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలన్నారు. ప్రభుత్వం తరపు లాయర్‌కు ధర్మాసనం పలు ప్రశ్న ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీకి పలు సందేహాలను వ్యక్తం చేసింది. 17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏమి కనిపెట్టారు ? అని ప్రశించారు. ‘అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా ?... మిగతా సెక్షన్ ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా ? లేదా ?’ అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి. ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సింగరేణి ఎన్నికలు వాయిదా
సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 27న నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.